బాబోయ్‌.. గోతులు తీసే పామును ఎప్పుడైనా చూశారా..? షాకింగ్‌ వీడియో చూస్తే చెమటలే..!

వీడియోను మాత్రం చాలా మంది చూశారు. ఈ వీడియోపై కామెంట్ల వెల్లువ సాగింది. ఒక వ్యక్తి ఫన్నీగా స్పందిస్తూ..గంట ప్రాతిపదికన గుంతలు తవ్వినందుకు డబ్బులు ఇస్తారనుకుంటా.. అంటుండగా, ఇలాంటివి మొదటిసారిగా చూస్తున్నామని, ఇది తమకు కొత్త సమాచారం అని రాశారు.

బాబోయ్‌.. గోతులు తీసే పామును ఎప్పుడైనా చూశారా..? షాకింగ్‌ వీడియో చూస్తే చెమటలే..!
Snake Digging Hole
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 15, 2024 | 1:57 PM

సోషల్‌ మీడియాలో అనేక రకాల పాములకు సంబంధించిన వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. వాటిలో కొన్ని పాములు ఒక చెట్టు నుండి మరొక చెట్టు మీదకు దూకటం మనం చూశాం..నిలువెత్తున లేచి పడగ విప్పే పాములను చాలా సార్లు చూశాం..గాల్లో ఎగురుతున్న పాములను కూడా చూశాం.. కానీ, పాము తనంతట తానుగా గొయ్యి తవ్వుకోవడం ఎప్పుడైనా చూశారా?అవును మీరు విన్నది నిజమే.. సన్‌షైన్ కోస్ట్ స్నేక్ క్యాచర్స్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఇలాంటి వీడియోను షేర్ చేశారు. ప్రపంచంలో అత్యధిక పాములు, విషపూరిత పాములు ఉన్న ఖండం ఆస్ట్రేలియా. ఈ వీడియో క్వీన్స్‌ల్యాండ్‌లోని సన్‌షైన్ కోస్ట్ నుండి వచ్చింది. సౌత్ ఈస్ట్ క్వీన్స్‌ల్యాండ్‌లోని పాము పట్టేవారి ఇన్‌స్టాగ్రామ్ పేజీ ఈ వీడియోను షేర్ చేసింది.

వైరల్‌ వీడియోలో ఒక పాము రోడ్డు పక్కన ఉన్న బొరియ నుండి మట్టిని తీస్తుంది. పాము తన తల, శరీరం ముందు భాగంతో రంధ్రం నుండి మట్టి కణాలను శ్రద్ధగా తీసుకుంటుంది. చాలాసార్లు బయటకు తీసిన మట్టి మళ్లీ గుంతలోకి పడిపోవడంతో మళ్లీ దాన్ని బయటకు తీయడానికి పాము కష్టపడాల్సి వస్తుంది. వీడియోను షేర్‌ చేస్తూ.. సన్‌షైన్ కోస్ట్ స్నేక్ క్యాచర్స్ ఇలా రాశారు, ‘పాము దాని తలతో రంధ్రం చేయడం మీరు ఎప్పుడైనా చూశారా? గతంలో కప్పలు, తాబేళ్లు, ఎలుకలు వంటి జంతువులు ఉపయోగించిన బొరియలను పాములు తమ ఆవాసంగా మార్చుకునేవి.. కానీ, ఇప్పుడు అవి వాటికి మరింత సౌకర్యవంతంగా ఉండేలా సొంతంగా గోతులు తీసుకుంటున్నాయి కాబోలు..! నెట్టింట ఈ దృశ్యాన్ని చూసిన నెటిజన్లు వీడియో షేర్‌ వారికి సెల్యూట్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూడండి..

వీడియో ఎక్కడిది అనే విషయం మాత్రం పోస్ట్‌లో చెప్పలేదు. కానీ, వీడియోను మాత్రం చాలా మంది చూశారు. ఈ వీడియోపై కామెంట్ల వెల్లువ సాగింది. ఒక వ్యక్తి ఫన్నీగా స్పందిస్తూ..గంట ప్రాతిపదికన గుంతలు తవ్వినందుకు డబ్బులు ఇస్తారనుకుంటా.. అంటుండగా, ఇలాంటివి మొదటిసారిగా చూస్తున్నామని, ఇది తమకు కొత్త సమాచారం అని రాశారు. వన్యప్రాణుల నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉందని మరొకరు వ్యాఖ్యనించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ