Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: లక్కీ ఛాన్స్ అంటే వీళ్లదే గురూ..! భార్యభర్తలకు ఆరు మద్యం దుకాణాలు…ఒకే నియోజకర్గంలో..

నియోజకవర్గంలోని ఇరవై షాపుల్లో ఆరు షాపులు వీరికే దక్కాయి. నియోజకవర్గంలో మొత్తం ఐదు మండలాలు ఉంటే నాలుగు మండలాల్లో షాపులు వీరికి రావడంపై స్తానికంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. విజయవాడకు చెందిన వీరు ఆన్ లైన్ దరఖాస్తులు చేసుకున్నారు.

Andhra Pradesh: లక్కీ ఛాన్స్ అంటే వీళ్లదే గురూ..! భార్యభర్తలకు ఆరు మద్యం దుకాణాలు...ఒకే నియోజకర్గంలో..
Ap Liquor Lottery
Follow us
T Nagaraju

| Edited By: Jyothi Gadda

Updated on: Oct 15, 2024 | 1:35 PM

రాష్ట్రంలో కూటమీ ప్రభుత్వం నూతన మద్యం పాలసీని తీసుకొచ్చింది. కొత్త పాలసీ ప్రకారం ప్రవేటు వ్యక్తులకు మద్యం షాపులను కేటాయిస్తారు. మద్యం షాపుల కేటాయింపుకు ప్రభుత్వం లాటరీ పద్దతిని అమలు చేసింది. ఒక వ్యక్తి ఎన్ని షాపులకైనా ధరఖాస్తు చేసుకోవచ్చు. నాన్ రిఫండబుల్ మొత్తం రెండు లక్షల రూపాయలను నిర్ణయించింది. అయితే ఐదేళ్ల తర్వాత మద్యం వ్యాపారం ప్రవేటు వ్యక్తుల చేతికి వస్తుండటంతో అనేకమంది షాపుల కోసం పోటీ పడ్డారు. వీరిలో మహిళలు కూడా ఉన్నారు.

అయితే నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మద్యం షాపులకు లాటరీ నిర్వహించింది. ఈ ప్రక్రియలో వింత అనుభవాలు ఎదురయ్యాయి. షాపులు దక్కించుకునేందుకు పదుల సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. మరికొంతమంది సిండికేట్ అయి వందల సంఖ్యలోనే అప్లికేషన్లు పెట్టారు. అయితే విజయవాడకు చెందిన శ్రీనివాసరావు దంపతులకు పెదకూరపాడు నియోజకవర్గంలో ఏకంగా ఆరు షాపులు వచ్చాయి. శ్రీనివాసరావు, అతని భార్య శివకుమారి పెదకూరపాడు నియోజకవర్గంతో పాటు గుంటూరు జిల్లాలో అరవై షాపులకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే నిన్న జరిగిన లాటరీలో ఒక్క పెదకూరపాడు నియోజకవర్గంలోనే ఆరు షాపులు ఈ భార్యభర్తలకు దక్కాయి.

పెదకూరపాడు మండలంలోని 121,123,124 షాపులు లాటరీలో శ్రీనివాసరావుకు వచ్చాయి. బెల్లంకొండ మండలంలో మరొకటి, క్రోసూరు మండలంలో ఇంకొకటి శ్రీనివాసరావు దక్కగా, అమరావతి మండలంలోని ఒక షాపు శ్రీనివాసరావు భార్య శివకుమారికి దక్కింది. దీంతో పెదకూరపాడు నియోజకవర్గంలోని ఇరవై షాపుల్లో ఆరు షాపులు వీరికే దక్కాయి. నియోజకవర్గంలో మొత్తం ఐదు మండలాలు ఉంటే నాలుగు మండలాల్లో షాపులు వీరికి రావడంపై స్తానికంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. విజయవాడకు చెందిన వీరు ఆన్ లైన్ దరఖాస్తులు చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన షాపుల లాటరీలో విధానంలో ఒకే నియోజకవర్గంలో ఆరు షాపులు ఒక్కరికే రావడం అద్రుష్టంగా చెప్పుకుంటున్నారు. షాపులు దక్కించుకోవడానికి సిండికేట్లుగా మారి వందల సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నా ఒక్క షాఫు కూడా దక్కని సిండికేట్ల చాలా ఉన్నాయి. కాని ఈ భార్యభర్తలకు మాత్రం ఆరు షాపులు రావడంతో వీళ్లు చాల అద్రుష్టవంతులంటూ ప్రచారం జరుగుతుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..