Viral: ప్రాణం తీసిన డీజే.! అప్పటివరకూ డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలిన యువకుడు..

Viral: ప్రాణం తీసిన డీజే.! అప్పటివరకూ డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలిన యువకుడు..

Anil kumar poka

|

Updated on: Oct 15, 2024 | 5:54 PM

డీజే..డిజే..డీజే.. ఇటీవల డీజే ఓ ట్రెండ్‌గా మారింది. ప్రతి శుభకార్యంలో డీజే కామన్‌ అయిపోయింది. దద్దరిల్లిపోయే ఈ డీజే చప్పుళ్లకు చాలా మంది అస్వస్థతకు గురవుతున్నారు. కొందరు ప్రాణాలే కోల్పోతున్నారు. మితిమీరిన సౌండ్‌, అత్యుత్సాహంతో వయసుతో సంబంధం లేకుండా అందరూ డాన్స్‌లు చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు గుండెపోటుకు గురవుతున్నారు. తాజాగా ఓ యువకుడు దసరా ఉత్సవాల్లో డాన్స్‌ చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు.

డీజే..డిజే..డీజే.. ఇటీవల డీజే ఓ ట్రెండ్‌గా మారింది. ప్రతి శుభకార్యంలో డీజే కామన్‌ అయిపోయింది. దద్దరిల్లిపోయే ఈ డీజే చప్పుళ్లకు చాలా మంది అస్వస్థతకు గురవుతున్నారు. కొందరు ప్రాణాలే కోల్పోతున్నారు. మితిమీరిన సౌండ్‌, అత్యుత్సాహంతో వయసుతో సంబంధం లేకుండా అందరూ డాన్స్‌లు చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు గుండెపోటుకు గురవుతున్నారు. తాజాగా ఓ యువకుడు దసరా ఉత్సవాల్లో డాన్స్‌ చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన అంబేద్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగింది.

అమలాపురం సమీపంలోని కొంకాపల్లి దసరా వేడుకల్లో డ్యాన్స్‌ చేస్తూ 21 ఏళ్ల యువకుడు కుప్పకూలిపోయాడు. అప్పటివరకూ సరదాగానే గడిపిన యువకుడు.. ఒక్కసారిగా స్ఫృహ తప్పిపోయేసరికి చుట్టుపక్కలవాళ్లు కంగారుపడ్డారు. వెంటనే అతనికి CPR చేశారు.. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతను చనిపోయినట్టు డాక్టర్లు చెప్పడంతో విషాదం అలముకుంది. మృతుడు బండారులంకకు చెందిన 21 ఏళ్ల వినయ్‌గా గుర్తించారు. కోనసీమ ప్రాంతంలో దసరాకి చెడీ తాలింఖానా విన్యాసాలతో దసరా వేడుకలు జరుగుతాయి.. ఈ ఉత్సవాల్లో DJకి అనుగుణంగా స్టెప్పులేస్తూ వినయ్‌ కుప్పకూలిపోవడంతో అంతా షాక్‌కి గురయ్యారు. హైదరాబాద్ నుంచి దసరా సెలవులకు సొంత ఊరు వచ్చాడు వినయ్. రెండు రోజుల్లో తిరిగి వెళ్లాల్సి ఉంది. ఐతే.. శనివారం రాత్రి డీజే దగ్గర డ్యాన్స్ లు చేస్తూ కుప్పకూలిపోయాడు. అతిగా DJ సౌండ్‌‌ పెట్టడం వల్ల ఆ ప్రభావం గుండెపై పడి ఇలా జరిగిందని స్థానికులు, కుటుంబ సభ్యులు చెప్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.