Viral Video: ఎక్కడ మొదలుపెట్టామన్నది కాదు.. ఎలా గెలిచామన్నదే ముఖ్యం.. వైరలవుతున్న బుడ్డోడి వీడియో..
Inspirational Video: జీవితంలో ఒడిదుడుకులనేవి సహజం.. ఒక్కోసారి ఊహించని పరిణామాలతో జీవితం తలకిందులవుతుంది. ఇలాంటి అనూహ్య పరిస్థితులు మనల్ని భయభ్రాంతులకు, గందరగోళానికి గురిచేస్తాయి.
Inspirational Video: జీవితంలో ఒడిదుడుకులనేవి సహజం.. ఒక్కోసారి ఊహించని పరిణామాలతో జీవితం తలకిందులవుతుంది. ఇలాంటి అనూహ్య పరిస్థితులు మనల్ని భయభ్రాంతులకు, గందరగోళానికి గురిచేస్తాయి. అంతేకాకుండా ముందుకు సాగకుండా అడ్డుపడతాయి. కానీ ధైర్యం, సహనం.. పట్టుదల ఉంటే ఎలాంటి క్లిష్ట పరిస్థితిని అయినా ఎదుర్కొవచ్చు అనేది జీవితసత్యం.. దీనికి సాక్ష్యమిచ్చే అనేక దృశ్యాలను మీరు సోషల్ మీడియాలో చాలానే చూసుంటారు. ఇప్పుడు ఇలాంటి మరో వీడియో (Viral Video) తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. ఇది వాస్తవానికి పిల్లల సైకిల్ పోటీల దృశ్యం. కానీ.. అందరికీ పట్టుదల స్ఫూర్తినిచ్చే అంశం. ఓ చిన్నారి కష్టాల్లో కూరుకుపోయిన దృశ్యం అందరినీ కలిచి వేస్తుంది. కానీ అలాంటి క్షణం నుంచి చిన్నారి బయటపడిన విధానం అందరినీ ఆకట్టుకుంటోంది.
ఈ వైరల్ వీడియోను.. ఐఏఎస్ అధికారి అవనీశ్ శరణ్ షేర్ చేశారు. ఎప్పుడూ కూడా స్ఫూర్తిదాయకమైన దృశ్యాలను పంచుకునే అవనీష్ ఈసారి పిల్లల సైకిల్ పోటీ ద్వారా అద్భుతమైన సందేశాన్ని అందించారు. 27 సెకన్ల సన్నివేశం పిల్లల సైకిల్ పోటీతో ప్రారంభమవుతుంది. అయితే, ప్రారంభంలోనే ఒక పిల్లవాడు కిందపడిపోతాడు. అలా పడిపోయిన పోయిన తర్వాత.. అలానే అక్కడ ఉండడు. పడిపోయినంత వేగంగా లేచి తన సైకిల్‌పై కూర్చుంటాడు. ఆ తర్వాత పిల్లవాడు చాలా వేగంగా సైకిల్‌పై పరుగులు తీస్తాడు. ఆ తర్వాత అందరికంటే ముందుకు దూసుకెళ్లి ఈ పోటీలో గెలుపొందుతాడు. ‘ఇది నువ్వు ఎక్కడ మొదలుపెట్టామన్నది కాదు, ఎక్కడ వరకు చేరామన్నదే ముఖ్యం’ అంటూ వీడియో షేర్ చేశారు అవనీష్.
వైరల్ వీడియో..
“फर्क इससे नहीं पड़ता कि आपने कहाँ से शुरुआत की, फर्क इससे पड़ता है कि आप पहुँचे कहाँ हो.” pic.twitter.com/Qfm9TE3nJG
— Awanish Sharan (@AwanishSharan) March 9, 2022
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సన్నివేశాన్ని చూసి యూజర్లు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో అందరికీ స్ఫూర్తినిస్తుందంటూ పేర్కొంటున్నారు.
Also Read: