ఇలాంటి ఆఫీసర్ ఒక్కరైనా ఉండాల్సిందే.. అడవిలో నదిని దాటేందుకు ఏం చేశారంటే..
వర్షాకాలంలో నదులు తమ మార్గాన్ని మార్చుకున్నప్పుడు మన విధులను కొనసాగించడానికి మౌలిక సదుపాయాలను మనమే సృష్టించుకోవాలి. అలాంటి వంతెన ఒకటి ఇక్కడ నిర్మించబడింది అని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో వేగంగా వైరల్ అవుతోంది. వీడియోపై చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది అధికారులను ప్రశంసించగా, మరికొందరు నది ఎంత శుభ్రంగా ఉందో అంటూ సంతోషం వ్యక్తం చేశారు.
వన్యప్రాణుల సంరక్షణ కోసం మన దేశంలో ఎన్నో చట్టాలు ఉన్నాయి. అటవీ శాఖ ప్రత్యేక రక్షణ కూడా ఉంది. కానీ, వన్యప్రాణుల సంరక్షణ కోసం అధికారులు కూడా మనకు తెలియని కొన్ని పనులు చేయాల్సి వస్తోంది. అలాంటి పోస్ట్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ పోస్ట్‌ను ఐఎఫ్‌ఎస్ అధికారి పర్వీన్ కస్వాన్ షేర్ చేశారు. అడవిలోకి వెళ్లేందుకు వారు తాత్కాలిక వంతెనను ఎలా నిర్మించారో ఈ పోస్ట్‌లో వివరించారు. పర్వీన్ కస్వాన్ ఇదంతా వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియా వేదికగా ప్రజలతో పంచుకున్నారు.
పెట్రోలింగ్, వేటగాళ్ల కోసం ఫారెస్ట్ అధికారులు తరచూ అడవుల్లోకి వెళ్లాల్సి వస్తోంది. కానీ, ఈ సమయంలో వారు అనేక సవాళ్లను, ప్రమాదాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ క్రమంలోనే నది గమనం మారినప్పుడు కొత్త వంతెనను ఎలా నిర్మించాల్సి వచ్చిందో ఐఎఫ్‌ఎస్ అధికారి పర్వీన్ కస్వాన్ ఈ పోస్ట్‌లో వివరించారు. నిర్మించిన వంతెన వీడియోను కూడా ఆయన షేర్ చేశారు. వీడియోలో నది ప్రవహం ఎలా ఉందో స్పష్టంగా కనిపించింది. వేగంగా పారుతున్న నదిపై వారు చెక్క వంతెన నిర్మించారు.
వీడియో ఇక్కడ చూడండి..
Connectivity is very important for patrolling & anti poaching duty. So during monsoon when rivers change their courses we have to make our own infrastructures to continue the duty. One such ongoing bridge work deep inside. pic.twitter.com/Dg6Fr7V3dK
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) December 19, 2024
ఇకపోతే, ఈ వీడియో క్యాప్షన్‌లో ఇలా రాశారు.. పెట్రోలింగ్, యాంటీ-పోచింగ్ విధులకు కనెక్టివిటీ చాలా ముఖ్యమని వెల్లడించారు. అందువల్ల వర్షాకాలంలో నదులు తమ మార్గాన్ని మార్చుకున్నప్పుడు మన విధులను కొనసాగించడానికి మౌలిక సదుపాయాలను మనమే సృష్టించుకోవాలి. అలాంటి వంతెన ఒకటి ఇక్కడ నిర్మించబడింది అని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో వేగంగా వైరల్ అవుతోంది. వీడియోపై చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది అధికారులను ప్రశంసించగా, మరికొందరు నది ఎంత శుభ్రంగా ఉందో అంటూ సంతోషం వ్యక్తం చేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..