AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: భార్యకు అదిరిపోయే బర్త్‌డే సర్‌ప్రైజ్‌ ఇచ్చిన భర్త.. వావ్ అంటోన్న నెటిజన్లు.! వీడియో మీకోసమే

భార్యాభర్తల మధ్య కోపతాపాలూ, ప్రేమానురాగాలు సర్వ సాధారణం. ఒకరికి తోడుగా మరొకరు ఉంటేనే లైఫ్‌ను హ్యాపీగా గడిపేయొచ్చు...

Viral Video: భార్యకు అదిరిపోయే బర్త్‌డే సర్‌ప్రైజ్‌ ఇచ్చిన భర్త.. వావ్ అంటోన్న నెటిజన్లు.! వీడియో మీకోసమే
Surprise Viral Video
Ravi Kiran
|

Updated on: Oct 10, 2021 | 12:48 PM

Share

భార్యాభర్తల మధ్య కోపతాపాలూ, ప్రేమానురాగాలు సర్వ సాధారణం. ఒకరికి తోడుగా మరొకరు ఉంటేనే లైఫ్‌ను హ్యాపీగా గడిపేయొచ్చు. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ బ్యూటిఫుల్ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇందులో ఓ భర్త తన భార్య పుట్టినరోజు నాడు ఎలాంటి సర్‌ప్రైజ్ ఇచ్చి ఆశ్చర్యపరిచాడో చూస్తే మీరూ ఫిదా అయిపోతారు.

ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కొద్దిరోజుల క్రిందట సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో రెండో పార్ట్. ఫస్ట్ వీడియోలో, తన పుట్టినరోజుకు.. భర్త ప్రత్యేకంగా ఎలాంటి ప్లానింగ్ చేయలేదని.. కేక్ కటింగ్, డిన్నర్ చేయడం మాత్రమే పుట్టినరోజు వేడుక కాదంటూ అతడిపై అరుస్తుంది. ఇక ఇప్పుడు ఆ భర్త.. తన భార్య పుట్టినరోజును జీవితాంతం గుర్తిండిపోయేలా సెలబ్రేట్ చేశాడు. ఇక ఆ భార్యాభర్తలు ఎవరో కాదు కంటెంట్ క్రియేటర్స్ హర్‌ప్రీత్‌, సింగ్

వైరల్ వీడియో ప్రకారం.. రూమ్ నిండా బెలూన్స్‌తో తన పుట్టినరోజు నాడు భర్త సింగ్‌తో కలిసి హర్‌ప్రీత్ కేక్ కట్ చేస్తున్నట్లు మీరు చూడవచ్చు. అంతేకాకుండా తన భార్యను ఆశ్చర్యపరుస్తూ ఆమె ముఖాన్ని తన చేతిపై టాటూగా వేయించుకున్నాడు. ఇక అది చూసిన ఆమె భావోద్వేగానికి లోనైంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

హర్‌ప్రీత్ ఓల్డ్ వీడియో…

ఇంతకు ముందు వైరల్ అయిన వీడియోలో, హర్‌ప్రీత్ తన భర్త సింగ్‌పై అరుస్తూ కనిపించింది. తన పుట్టినరోజుకి ఆమె భర్త పెద్దగా ఏర్పాట్లు చేయకపోవడమే దానికి కారణం. వీడియోలో, తన భర్తను ఆశ్చర్యపరుస్తూ.. ఎలా అతడి పుట్టినరోజు జరిపిందో వివరిస్తుంది. ఈ క్రమంలోనే తన పుట్టినరోజుకి కూడా భర్త నుంచి సర్‌ప్రైజ్ గిఫ్ట్స్ ఉంటాయేమోనని ఆశలు పెట్టుకుంది. అతడు ఆమెను ఆశ్చర్యపరిచేందుకు ముందుగా ఏమి లేవని చెప్పడంతో నిరాశ చెందింది.

కాగా, ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోపై నెటిజన్లు కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. ‘ఈ అమ్మాయి చాలా ముద్దుగా ఉంది’ అని ఒకరు కామెంట్ చేయగా.. ‘ఈ ఇద్దరి జంట చూడముచ్చటగా ఉంది’ అని మరొకరు కామెంట్ చేశారు.

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి