Viral News: మ్యాగీలో మసాలాలు ఎప్పుడు వేయాలి..? ఇప్పుడిదే నెట్టింట హాట్‌ టాపిక్‌ .. ఇంతకీ మీకు తెలుసా..

అందువల్ల ముందుగా నూడుల్స్‌ వేసుకుని ఆ తర్వాత మసాలా దినుసులు కలుపుకోవాలని.. ఆ తరువాత నీళ్లు పోయాలని మరికొందరు చెప్పారు. అయితే, ఇలా చేస్తే మసాలా ముద్దగా ఉండలు కడుతుందని మరికొందరు రాసుకొచ్చారు. కాబట్టి మొదట నీటిని మరిగించి, ఆపై నూడుల్స్, మసాలా దినుసులను కలుపుతామని మరికొందరు వినియోగదారులు చెప్పారు.

Viral News: మ్యాగీలో మసాలాలు ఎప్పుడు వేయాలి..? ఇప్పుడిదే నెట్టింట హాట్‌ టాపిక్‌ .. ఇంతకీ మీకు తెలుసా..
Instant Noodles
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 03, 2023 | 4:16 PM

మ్యాగీ నూడుల్స్.. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమైన వంటకం. మ్యాగీని చాలా మంది ఇష్టపడతారు.. ఎందుకంటే మార్కెట్లో మ్యాగీ చౌకగా లభిస్తుంది. దీన్ని తయారు చేయడం కూడా చాలా ఈజీ. ఇక రుచిగా చాలా బాగుంటుంది. హాస్టల్‌లో ఉంటున్నా లేదా ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్లినా, మ్యాగీ నూడుల్స్ అందుబాటులో లభించే, కడుపునింపే ఆహారం. ఉదయం, రాత్రి అనే తేడాలేదు. ఎపన్పుడు కావాలంటే అప్పుడే మ్యాగీని తయారు చేసుకోవచ్చు. చల్లని వాతావరణంలో వేడి మ్యాగీ చేసుకుని తింటే ఆ మజాయే వేరు. అయితే, మ్యాగీ తయారీలో ఎవరికి వారు తమ అభిరుచులకు తగినట్టుగా మ్యాగీని తయారు చేస్తారు. కొందరు మసాలా దినుసులలో వెన్న వేసి నూడుల్స్ వేయించిన తర్వాత నీళ్లు కలుపుతారు. మరికొందరు, నీళ్లు మరిగించిన తర్వాత ముందుగా మసాలాలు వేస్తారు. అవును, ఏది ఏమైనా మ్యాగీతో చాలా ప్రయోగాలు జరుగుతుంటాయి.. అయితే, ఇప్పుడు ట్విట్టర్‌లో మ్యాగీ తయారీపై ఒక పెద్ద చర్చ మొదలైంది. మ్యాగీ తయారు చేస్తున్నప్పుడు మసాలా ఎప్పుడువేయాలి. దానిపై ఇప్పుడు నెట్టింట చర్చ నడుస్తోంది.

మే 28న ట్విట్టర్ యూజర్ @biganushaenergy ఈ పోస్ట్ చేసారు. దీనికి క్యాప్షన్‌గా వారు ఇలా వ్రాశారు – ఎవరు మ్యాగీని తయారు చేయటానికి ముందు నీటిలో మసాలాలు కలుపుతారు. అని ప్రశ్న వేశారు. అయితే, దీనిపై చాలా మంది స్పందించారు. నీళ్లలో మసాలా దినుసులు వేస్తే అది నూడుల్స్‌కి బాగా పట్టుకుంటుందని కొందరు రాశారు. అలాంటప్పుడు నీళ్లు ఎక్కువగా పోస్తే ఎలా మరీ అంటూ మరో ప్రశ్న వేశారు. అందువల్ల ముందుగా నూడుల్స్‌ వేసుకుని ఆ తర్వాత మసాలా దినుసులు కలుపుకోవాలని.. ఆ తరువాత నీళ్లు పోయాలని మరికొందరు చెప్పారు. అయితే, ఇలా చేస్తే మసాలా ముద్దగా ఉండలు కడుతుందని మరికొందరు రాసుకొచ్చారు. కాబట్టి మొదట నీటిని మరిగించి, ఆపై నూడుల్స్, మసాలా దినుసులను కలుపుతామని మరికొందరు వినియోగదారులు చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఏది ఏమైనా ఈ వార్త మాత్రం నెట్టింట తీవ్ర చర్చకు దారి తీసింది. వార్త చదివిన ప్రతి ఒక్కరూ మ్యాగీ తయారీపై తమ స్పందన తెలియజేస్తున్నారు. విషయం వైరల్‌గా మారటంతో పోస్ట్‌పై రెండు వేలకు పైగా లైక్‌లు, మూడు లక్షలకు పైగా వ్యూస్‌ వచ్చాయి. అయితే, ఇక్కడ వేసిన ప్రశ్నకు సమాధానం మీరు కూడా మీ కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మ్యాగీలో మసాలా ఎప్పుడు వేయాలి..ఇదే మీ ప్రశ్న..!

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?