AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ‘యా ఊరురా సామి నీది’.. బ్యాంక్ బెంచ్ స్టూడెంట్స్ ప్రెసిడెంట్ మాదిరి ఉన్నావ్‌గా

Social Media: స్టూడెంట్ రాక్స్.. టీచర్ షాక్స్. ఎగ్జామ్‌లో స్టూడెంట్స్ రాసే కొన్ని ఫన్నీ ఆన్సర్స్.. భలే నవ్వు తెలిస్తాయి. ఇంకొన్నిసార్లు భలే ఇస్మార్ట్ ఫెల్లో అని ప్రశంసించేలా చేస్తాయి.

Viral: 'యా ఊరురా సామి నీది'.. బ్యాంక్ బెంచ్ స్టూడెంట్స్ ప్రెసిడెంట్ మాదిరి ఉన్నావ్‌గా
Student Funny Answer
Ram Naramaneni
|

Updated on: Aug 20, 2022 | 2:09 PM

Share

Trending: మనందరం స్కూల్‌ స్టేజ్ దాటే వచ్చాం. అప్పుడు జరిగిన మధుర స్మృతులు.. ఇప్పుడు గుర్తు చేసుకుంటే ఎంతో బాగుంటాయ్ కదా. చేసిన అల్లరి, చిన్ని.. చిన్ని గొడవలు.. తెలిసి తెలియని వయసు ఆకర్షణలు భలే ఉంటాయ్. అరె మనం అప్పుడు ఇలా ఉండేవాళ్లమా అనిపిస్తుంది తలుచుకుంటే. ఇక్కడ మరో విషయం కూడా చెప్పాలి. పాఠశాలల్లో వీక్లీ టెస్టులు లేదా ఎగ్జామ్స్‌లో రాసిన ఫన్నీ ఆన్సర్స్ తలుచుకుంటే ఇప్పుడు కూడా నవ్వు వస్తుంది.  ఉపమాలంకారం గురించి రాయమంటే ఉప్మా గురించి రాయడం.. సెకండ్ వరల్డ్ వార్ గురించి వివరించమంటే.. ఆ ముందు రోజు చూసిన సినిమా స్టోరీ రాయడం వంటి తింగరి సమాధానాలు మీరు కూడా చూసే ఉంటారు. ఏదో ఒకటి సోది రాస్తే.. ఓవర్ ప్లో టీచర్స్ మార్కులు వేస్తారని ఇలా చేస్తారు. అయితే కొన్నిసార్లు టీచర్లు ఈ సమాధానాలు పట్టేసి.. కోటింగ్ కూడా ఇస్తారు. ఇలాంటి జాతిరత్నాల్లో మీరు ఒకరు అయ్యి ఉండవచ్చు లేదా మీ ఫ్రెండ్ అయి ఉండవచ్చు. తాజాగా ఓ క్రేజీ ఫెల్లో రాసిన ఇస్మార్ట్ ఆన్సర్ మీ ముందుకు తీసుకొచ్చాం.

సెంటీమీటర్ల(centimeters)ను మీటర్ల( meters)లోకి ఎలా మారుస్తారు అన్నది క్వచ్చన్. దీనికి మెరిట్ స్టూడెంట్ అయితే మాస్టర్ నేర్పించిన ఆన్సర్ రాస్తాడు. కానీ మనోడు జాతిరత్నం కదా అందుకే అదిరే ఆన్సర్ ఇచ్చాడు. centi అనే  ఇంగ్లీషు అక్షరాలు తీసేస్తే సరిపోతుందని ఆ స్టూడెంట్ సమాధానమిచ్చాడు. ఇది చూసిన నెటిజన్స్ వీడు తోపురా అని కామెంట్స్ పెడుతున్నారు. కుర్రాడు ఫ్యూచర్‌లో దుమ్మురేపుతాడు అని పేర్కొంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..