AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: వారెవ్వా ఏమి ఫ్లైయింగ్ మావ.. కోడి సాహసం చూస్తే మైండ్ బ్లాంకే..!

ఇంట్లో పెరిగే కోళ్లు అప్పుడప్పుడూ ఎగరడం చూస్తుంటాం... కోళ్లు ఎగురుతాయని కూడా తెలుసు కానీ ఇంత దూరం ఎగురుతుందని తెలియదు...కానీ ఓ కోడిపెట్ట మాత్రం రివ్వున ఎగురుతోంది. అది ఆకాశంలో నెమలి రెక్కల్ని విసురుకుంటూ వెళ్తున్నట్టుగా ఏకంగా అరకిలోమీటర్ దూరం ఎగురుతూ వెళ్లింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Watch Video: వారెవ్వా ఏమి ఫ్లైయింగ్ మావ.. కోడి సాహసం చూస్తే మైండ్ బ్లాంకే..!
Hen Flying Long Distance
Jyothi Gadda
|

Updated on: Mar 26, 2024 | 5:07 PM

Share

సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. అందులో కొన్ని ఫన్నీ వీడియోలు అయితే, మరికొన్ని ఆలోచింపజేసివిగా ఉంటాయి. సోషల్ మీడియాలో వీడియోలు ఎక్కువగా జంతువులు, పక్షులకు సంబంధించిన నెటిజన్లు ఎక్కువగా ఆదరిస్తుంటారు. జంతువులు, పక్షులకు సంబంధించి మనకు తెలియని ఎన్నో చిత్ర విచిత్ర విషయాలు ఇక్కడ కనిపిస్తుంటాయి. వాటిని చూసిన పిల్లలు,పెద్దలు వీడియోలను లైక్‌ చేస్తుంటారు. అందుకే ఇంటర్‌నెట్‌ వేదికగా జంతుప్రపంచాన్ని వీక్షించే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మాకీ పక్షులు, జంతువుల గోలేంటని తలపట్టుకుంటున్నారు కదా.? ఎందుకంటే.. ఇక్కడ మనం చూడబోయేది కూడా పక్షులకు సంబంధించిన వీడియోనే..అందులో ఏముందో తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు.

పక్షులు గాల్లో ఎగరటం సర్వసాధారణం. అందుకే చిలుకలు, పావురాలు, కాకులు, గద్దల వరకు చాలా పక్షులు ఆకాశంలో ఎగరటం మనం చూస్తుంటాం..అలాగే, కోడి కూడా పక్షి జాతికి చెందినదే.. కానీ, కోడి గాలిలో ఎక్కువ దూరం ఎగరలేదు. కోడి సుమారు ఒక అర కిలోమీటర్ వరకు ఎగరగలదు. అంతేగానీ, ఎక్కువ దూరం ఎగరటం కోళ్లకు చేతకాదు..ఎందుకంటే, కోళ్ల శరీర బరువు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి… అవి ఎక్కువ ఎత్తుకు, దూరం ఎగరలేవు. అలా ఇంట్లో పెరిగే కోళ్లు అప్పుడప్పుడూ ఎగరడం చూస్తుంటాం… కోళ్లు ఎగురుతాయని కూడా తెలుసు కానీ ఇంత దూరం ఎగురుతుందని తెలియదు…కానీ ఓ కోడిపెట్ట మాత్రం రివ్వున ఎగురుతోంది. అది ఆకాశంలో నెమలి రెక్కల్ని విసురుకుంటూ వెళ్తున్నట్టుగా ఏకంగా అరకిలోమీటర్ దూరం ఎగురుతూ వెళ్లింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఇవి కూడా చదవండి

ఒక వైరల్ వీడియోలో ఒక నది ఒడ్డున కోళ్ల గుంపు ఒకటి కనిపిస్తుంది. అందులోంచి అకస్మాత్తుగా ఒక కోడి నది మీదుగా ఎగిరింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. కోడి ఎగరడం మనం ఇంతవరకూ చూడలేదంటే ఆ వీడియో మనకే ఆశ్చర్యం కలిగిస్తుంది. వైరల్ వీడియో చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు..ఈ వీడియో ఎక్కడ తీశారో తెలియదు గానీ,..అకస్మాత్తుగా ఒక కోడి నదికి అడ్డంగా ఎగిరింది. ఆ కోడికి ఇంత బలం ఎలా వచ్చిందో అనేది మాత్రం ఆశ్చర్యమే..!

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..