AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral video: మరీ ఇలా ఉన్నారేంట్రా.! హోలీ పేరుతో నడిరోడ్డుపై అమ్మాయిల వికృత చేష్టలు.. తిక్క కుదిర్చిన పోలీసులు

వైరల్ వీడియోలో అమ్మాయిలిద్దరూ మోహే రంగ్ లగా దే పాటపై స్కూటర్‌పై కూర్చుని డ్యాన్స్ చేస్తున్నారు. అమ్మాయిలు డ్యాన్స్ చేస్తున్నారా లేక అసభ్యకర పనులు చేస్తున్నారా లేదా రొమాన్స్ చేస్తున్నారా అనేది వీడియో చూసి మీరే నిర్ధారించుకోవాలి. అయితే ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Viral video: మరీ ఇలా ఉన్నారేంట్రా.! హోలీ పేరుతో నడిరోడ్డుపై అమ్మాయిల వికృత చేష్టలు.. తిక్క కుదిర్చిన పోలీసులు
Noida Girls Holi
Jyothi Gadda
|

Updated on: Mar 25, 2024 | 3:01 PM

Share

దేశవ్యాప్తంగా హోలీ పండుగను అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ప్రజలు రంగుల్లో తడిసి ముద్దవుతున్నారు. హోలీ సంబరాల నడుమ ప్రజలకు ఆగ్రహం తెప్పించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. అది చూసిన జనాలు భగ్గున మండిపోతున్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ నెటిజన్లకు అంత కోపం తెప్పించిన ఆ వీడియోలో ఏముంది..? ఎందుకు జనాలు అది చూసిన మండిపడుతున్నారు..?వైరల్‌ వీడియోలో ముగ్గురు వ్యక్తులు స్కూటర్‌పై వెళుతున్నారు. వారిలో ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. అబ్బాయి స్కూటర్ నడుపుతున్నాడు. వెనకాల కూర్చున్న ఆ ఇద్దరు అమ్మాయిలు చేసిన పనికి సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

వైరల్ వీడియోలో అమ్మాయిలిద్దరూ మోహే రంగ్ లగా దే పాటపై స్కూటర్‌పై కూర్చుని డ్యాన్స్ చేస్తున్నారు. అమ్మాయిలు డ్యాన్స్ చేస్తున్నారా లేక అసభ్యకర పనులు చేస్తున్నారా లేదా రొమాన్స్ చేస్తున్నారా అనేది వీడియో చూసి మీరే నిర్ధారించుకోవాలి. అయితే ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియో గ్రేటర్ నోయిడాకు చెందినదని చెబుతున్నారు. ఓ వైపు ఇద్దరు అమ్మాయిలు రీలు వేయాలని పిచ్చి పనులు చేస్తుంటే మరోవైపు ముగ్గురు వ్యక్తులు ఒకే స్కూటర్‌పై వెళ్తున్నారు. అది కూడా వారిలో ఏ ఒక్కరికి కూడా హెల్మెట్ లేకుండా డ్రైవ్‌ చేస్తున్నారు. ఈ వీడియోను షేర్ చేస్తూ పోలీసులు వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు.

ఇవి కూడా చదవండి

హోలీ పేరుతో యువతీ యువకులు అశ్లీలతను వ్యాపింపజేశారని, ఢిల్లీ మెట్రో ప్రభావం గ్రేటర్ నోయిడాకు చేరిందని ఆరోపించారు. ఇలాంటి నీచమైన పనులు ఎలా చేస్తారంటూ మండిపడుతున్నారు. రీళ్లపేటి దెయ్యలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఈ ఇద్దరు అమ్మాయిలు ఇలాంటి అసభ్యకర పనులు చేస్తూ సమాజానికి ఏం సందేశం పంపుతారని మరొకరు రాశారు. పిల్లలు కూడా ఈ వీడియో చూసి ప్రభావితం అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తు్న్నారు.

పండుగ పేరుతో గుడిగోపురాల వంటి పవిత్ర ప్రదేశాల్లోనూ ఇలాంటి వారు అశ్లీలత, పిచ్చి డ్యాన్స్‌లు, పాటలు వంటివి ప్రదర్శిస్తూ ఎంజాయ్‌ చేయటం ఇప్పుడు ప్రజల్లో సర్వసాధారణంగా మారిపోయిందని ఒకరు ఆరోపించారు.. ఇందులో ఉపేక్షించాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని, పోలీసులు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఒకరు వ్యాఖ్యనించగా, అలాంటి వారిని అదుపు చేయడం చాలా ముఖ్యం అని మరొకరు రాశారు. వీడియో వైరల్ అయిన తర్వాత, నోయిడా పోలీసులు వారికి రూ. 33 వేల చలాన్ విధించినట్టుగా తెలిసింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోలీసులు ఈ సమాచారాన్ని షేర్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ