AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కాళ్లకు క్రాకర్స్ కట్టుకుని.. చీర కట్టులో స్టంట్‌ చేసిన చిన్నదానికి ఊహించని షాక్‌ తగిలింది.. ! ఏమైందో చూడండి..

హోలీ పేరుతో స్టంట్స్‌ చేస్తూ కొందరు ప్రజల ఆగ్రహానికి గురవుతున్నారు. మరికొందరు ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక అమ్మాయి తన పాదాలకు హోలీ పటాకులు కట్టుకుని స్టంట్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ స్టంట్ ఆమెను ఊహించని ప్రమాదంలోకి నెట్టేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

Viral Video: కాళ్లకు క్రాకర్స్ కట్టుకుని.. చీర కట్టులో స్టంట్‌ చేసిన చిన్నదానికి ఊహించని షాక్‌ తగిలింది.. ! ఏమైందో చూడండి..
Girl Stunt Wearing Saree
Jyothi Gadda
|

Updated on: Mar 25, 2024 | 3:40 PM

Share

హోలీ పట్ల ప్రజలు చాలా ఉత్సాహం చూపిస్తుంటారు. చిన్నా పెద్దా అంతా కలిసి రంగులు చల్లుకుంటూ జరుపుకునే సంబరమే హోలీ. దేశ వ్యాప్తంగా ప్రజలు హోలీని ఎంతో ఉత్సహంగా జరుపుకుంటుంటే.. మరికొందరు మాత్రం సోషల్ మీడియాలో రీల్స్‌ కోసం విపరీత చర్యలకు పాల్పడుతున్నారు. నెటిజన్ల దృష్టి ఆకర్షించేందుకు కొందరు ఎంతటి రిస్కైనా ఓకే అంటున్నారు. ఇలాంటి ప్రయత్నాల్లో కొందరు ప్రమాదాల బారిన పడుతున్నారు. దాదాపు అలాంటిదే ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతూ ప్రజల్ని బెంబేలెత్తిస్తోంది. హోలీ పేరుతో స్టంట్స్‌ చేస్తూ కొందరు ప్రజల ఆగ్రహానికి గురవుతున్నారు. మరికొందరు ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక అమ్మాయి తన పాదాలకు హోలీ పటాకులు కట్టుకుని స్టంట్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ స్టంట్ ఆమెను ఊహించని ప్రమాదంలోకి నెట్టేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

వైరల్ వీడియోలో ఒక యువతి తన కాళ్లకు హోలీ పటాకులు కట్టుకుని ఊయల మీద తిరుగుతోంది. అక్కడ మరికొంతమంది అబ్బాయిలు కూడా ఉన్నారు. వారంతా ఆమెకు సహాయం చేశారు. ఒకరు వీడియో రికార్డ్ చేయడం కూడా మనకు వీడియోలో కనిపిస్తుంది. కాళ్లకు పటాకులు కట్టుకున్న యువతి స్వింగ్‌లో తిరుగుతూ విన్యాసాలు చేసేందుకు ప్రయత్నిస్తుండగా, ప్రమాదవశాత్తు బాణాసంచా ఆమె కాళ్లకు తగిలింది బాగానే కాలింది. దాంతో ఆమె వెంటనే ఊయల నుండి దిగి కాళ్లకు అంటుకున్న అగ్గిని ఆర్పేందుకు ప్రయత్నించింది. ఆ అమ్మాయి చీర పైకి లాగి పటాకులు ఆర్పే ప్రయత్నం మొదలుపెట్టింది. ఇది చూసి అక్కడ ఉన్న యువకులు పరిగెత్తుకుంటూ వచ్చి బాణాసంచా ఆర్పేందుకు సహకరించారు. ఆ పటాకులు పేలకుండా వారంతా అడ్డుకున్నారు. దాంతో యువతికి పెను ప్రమాదం తప్పింది. ఆమె సురక్షితంగా బయటపడగలిగింది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Shalu Kirar (@shalugymnast)

ఈ వీడియో @shalugymnast అనే ఖాతాతో Instagramలో భాగస్వామ్యం చేయబడింది. ఆ వీడియోను షేర్ చేసి వారు క్యాప్షన్‌లో ఇలా రాశారు.. నా హోలీ అయిపోయింది అంటూ..! ఇప్పుడు చాలా మంది వినియోగదారులు ఈ వీడియోపై తమ స్పందనలను తెలియజేస్తున్నారు. ఒకరు రాశారు.. మరిన్ని విన్యాసాలు చేయండి! ఇలాంటి అర్ధంలేని వీడియోలు ఎందుకు వైరల్ అవుతున్నాయో తెలియదంటున్నారు. మరోకరు ఈ అక్క రాకెట్‌గా మారిందని నేను అనుకున్నాను అని మరొకరు రాశారు. ఇంత రిస్కీ రీల్ ఎవరూ చేయకూడదని, జీవితం చాలా చిన్నదని ఇంకొకరు రాశారు. ఇలా వీడియోలు చేసి త్వరగా ఫేమస్ అవ్వాలని అక్కాచెల్లెళ్లు కోరుకుంటున్నారని మరొకరు రాశారు. అక్కా ఇలాంటి వీడియో చేయాల్సిన అవసరం ఏముందని ఇంకొకరు రాశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..