Optical Illusion: కళ్లను సైతం మోసం చేసే మ్యాజిక్.. ట్రై చేసి చూడండి అవాక్కవుతారు..
Optical Illusion: ఆప్టికల్ ఇల్యూజన్‌కు సంబంధించిన ఫోటోలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. చూసే కళ్లను సైతం మాయ చేసే పవర్ వీటికి ఉంటుంది. సోషల్ మీడియా విస్తృతి పెరిగినప్పటి నుంచి ఇలాంటి ఫోటోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి...
Optical Illusion: ఆప్టికల్ ఇల్యూజన్‌కు సంబంధించిన ఫోటోలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. చూసే కళ్లను సైతం మాయ చేసే పవర్ వీటికి ఉంటుంది. సోషల్ మీడియా విస్తృతి పెరిగినప్పటి నుంచి ఇలాంటి ఫోటోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. ఇప్పటి వరకు నెట్టింట వైరల్ అయిన వాటిలో ఎక్కువగా బొమ్మల్లో కనిపించే వస్తువుల ఆధారంగా మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేసే ఫోటోలనే చూసి ఉంటారు. అలా కాకుండా మీ కళ్లను మాయ చేసే ఇల్యూజన్స్ కూడా ఉంటాయని మీకు తెలుసా.? అంతేకాకుండా మీరు ఇప్పటి వరకు ఆప్టికల్ ఇల్యూజన్‌కు సంబంధించిన ఫోటోలనే చూసి ఉంటారు. కానీ వీడియోలను ఎప్పుడైనా చూశారా.? ప్రస్తుతం అలాంటి ఓ వీడియోనే నెట్టింట వైరల్ అవుతోంది.
పైన కనిపిస్తోన్న ఫోటోలో గుండ్రంగా ఉన్న డాట్స్ బ్లింక్ అవుతున్నట్లు కనిపిస్తోంది కదూ. అయితే ఓసారి మధ్యలో ఉన్న ‘+’ సింబల్‌ను తీక్షణంగా చూడండి. ఆసక్తినంతా కేంద్రీకరించి ఆ సింబల్‌పైనే దృష్టి సారించండి మీకు ఒక అద్భుతం కనిపిస్తుంది. కాసేపటికి చుట్టూ ఉన్న బ్లాక్ సర్కిల్స్ అదృశ్యం కావడాన్ని గమనిస్తారు. వినడానికి వింతగా ఉన్నా ఏకాగ్రతతో చూస్తే థ్రిల్ ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. మీరు ఈ మ్యాజిక్‌ను ఎంజాయ్ చేశారా.? అయితే మీ ఫ్రెండ్స్‌కు షేర్ చేసి వారిని సర్‌ప్రైజ్ చేయండి.