Index Mutual Funds: ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్లలో రాబడి ఎలా ఉంటుంది.. ధీర్ఘకాలికంగా పెట్టుబడి మంచిదేనా..

చాలా మంది స్టాక్‌ మార్కెట్‌(Stock Market)లో ఇన్వెస్టే చేయాలనుకుంటారు. కానీ స్టాక్స్‌లో పెట్టబడి పెట్టాలంటే స్టాక్‌ మార్కెట్‌పై అవగాహన ఉండాల్సిందే...

Index Mutual Funds: ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్లలో రాబడి ఎలా ఉంటుంది.. ధీర్ఘకాలికంగా పెట్టుబడి మంచిదేనా..
Stocks Vs Mutual Funds
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Apr 08, 2022 | 10:08 AM

చాలా మంది స్టాక్‌ మార్కెట్‌(Stock Market)లో ఇన్వెస్టే చేయాలనుకుంటారు. కానీ స్టాక్స్‌లో పెట్టబడి పెట్టాలంటే స్టాక్‌ మార్కెట్‌పై అవగాహన ఉండాల్సిందే.. అందుకే అటువంటి వారు మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలంటారు నిపుణులు. అయితే ఇందులో కూడా రిస్క్ ఉంటుంది. ఫండ్స్‌లో పెట్టబడి పెట్టాలనుకునేవారు మొదటగా ఇండెక్స్ ఫండ్స్‌(Index Fund)లో పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. అయితే ఇండెక్స్ ఫడ్స్‌ ఎలా పని చేస్తాయో చూద్దాం.. పేరులోనే ఉన్నట్లు ఈ ఫండ్లు ఇండెక్స్ ఉన్న షేర్లలోనే మదుపు చేస్తాయి. సూచీల్లో ఆ షేరుకు వెయిటేజీ మారితే.. అందుకు తగ్గట్టుగానే ఫండ్‌ పెట్టుబడుల్లోనూ సర్దుబాటు జరుగుతుంది. ఉదాహరణకు నిఫ్టీ ఇండెక్స్‌ ఫండ్‌(Nifty Index Fund).. నిఫ్టీ 50 సూచీలోని 50 కంపెనీల్లో మాత్రమే పెట్టుబడి పెడుతుంది.

ఇండెక్స్‌ ఫండ్‌ ద్వారా మదుపు చేసినప్పుడు సులభంగా వైవిధ్యమైన షేర్లలో మదుపు చేసేందుకు అవకాశం లభిస్తుంది. నిఫ్టీ 50 ఇండెక్స్‌నే తీసుకుంటే.. ఈ సూచీ ద్వారా మదుపరులు విభిన్న కంపెనీల్లో మదుపు చేయొచ్చు. ఇండెక్స్‌లో భాగంగా ఉన్న ఏదైనా కంపెనీ ప్రతికూల వృద్ధిని నమోదు చేసినా.. పోర్ట్‌ఫోలియోలోని ఇతర షేర్లు పెట్టుబడి నష్టపోకుండా భర్తీ చేస్తాయి. ఈక్విటీ పథకాలతో పోలిస్తే ఇండెక్స్‌ ఫండ్లలో ఖర్చులు తక్కువగా ఉంటాయి. మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ ప్రకారం ఇండెక్స్‌ ఫండ్‌ కోసం మొత్తం ఎక్స్‌పెన్స్‌ రేషియో 1 శాతానికే పరిమితమై ఉంటుంది. కాబట్టి, పెట్టుబడుదారులకు ఈ ఫండ్లు చౌకైన ఎంపికగా చెప్పుకోవచ్చు.

దీర్ఘకాలంలో పెట్టుబడిని కొనసాగించినప్పుడు మంచి లాభాలను పొందేందుకు వీలవుతుంది. ఉదాహరణకు అయిదేళ్ల కాలంలో నిఫ్టీ 50 టీఆర్‌ఐ 15 శాతం వార్షిక సగటు రాబడిని అందించింది. ఇతర ఈక్విటీ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడులు పెట్టినట్లే… వీటిలోనూ సిప్‌ చేసేందుకు అవకాశం ఉంది. సూచీలు తగ్గినప్పుడు వీలును బట్టి కొనుగోలు చేసుకోవచ్చు. ప్రతి మదుపరి తన పెట్టుబడుల జాబితాలో ఇండెక్స్‌ ఫండ్లకు స్థానం కల్పించాలని నిపుణులు సూచిస్తున్నారు. కొత్తగా ఈక్విటీల్లో మదుపు చేస్తున్న వారు ఈ ఫండ్లను తొలి మెట్టుగా భావించవచ్చు.

Read Also.. Stock Market: స్వల్ప లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు.. మళ్లీ తగ్గిన హెచ్‌డిఎఫ్‌సీ గ్రూప్ షేర్లు..