Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hard Work vs Smart Work: స్మార్ట్‌ వర్క్‌ అంటే ఇదేమరీ!.. ఈ కూలీల పనితీరు చూస్తే అవాక్కవ్వాల్సిందే..

Hard Work vs Smart Work: హార్డ్‌ వర్క్‌ కాదు.. స్మార్ట్‌ వర్క్‌ చేయాలని చెబుతుంటారు చాలామంది. గంటల తరబడి శారీరక శ్రమతో చేసే పనిని కూడా..

Hard Work vs Smart Work: స్మార్ట్‌ వర్క్‌ అంటే ఇదేమరీ!.. ఈ కూలీల పనితీరు చూస్తే అవాక్కవ్వాల్సిందే..
Smart Work
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 17, 2021 | 8:00 AM

Hard Work vs Smart Work: హార్డ్‌ వర్క్‌ కాదు.. స్మార్ట్‌ వర్క్‌ చేయాలని చెబుతుంటారు చాలామంది. గంటల తరబడి శారీరక శ్రమతో చేసే పనిని కూడా స్మార్ట్‌ ఆలోచనతో చాలా ఈజీగా చేయొచ్చు. దీనివల్ల పని వేగంగా జరగడంతో పాటు కచ్చితత్త్వంతో జరుగుతుంది. శరీరానికీ అలసట తగ్గుతుంది. దీనికి ఎన్నో ఉదాహరణాలున్నాయి. అయితే, తాజాగా నెట్టింట వైరల్‌ అవుతోన్న ఈ వీడియో దీనికి సాక్ష్యంగా నిలుస్తోంది.

ఓ అడవిలో చెట్లను నరికిన తర్వాత దుంగలను లారీలోకి ఎక్కించాల్సి వచ్చింది. అయితే సహజంగా భుజాలపై లేదా చేతులతో మోస్తూ వాటిని తరలిస్తుంటారు. కానీ కొందరు కూలీలు మాత్రం దీనికి భిన్నంగా ఆలోచించారు. హార్డ్‌ వర్క్‌ను కాకుండా స్మార్ట్‌ వర్క్‌ను నమ్ముకున్నారు. పెద్ద పెద్ద దుంగలను సింపుల్‌గా లారీలోకి ఎక్కించేశారు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. దుంగలను లారీలోకి ఎక్కించడానికి ముందుగా లారీపై నుంచి కింది వరకు రెండు పెద్ద కర్రలను అమర్చారు. అనంతరం ఆ దుంగకు తాడును జోడించి రెండు కర్రలపై నుంచి పైకి లాగడం ప్రారంభించారు. సుమారు 100 కిలోలకు పైగా ఉండే ఆ దుంగలను ఈ ట్రిక్‌తో సింపుల్‌గా లారీలోకి ఎక్కించారు.

కాగా, ఈ వీడియోను తేజాన్‌ శేఖర్‌ అనే ఐఎఫ్‌ఎస్‌ ఆఫీసర్‌ ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో ఈ వీడియో కాస్త వైరల్‌గా మారింది. కార్మికుల స్మార్ట్‌ వర్క్‌ను చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు ‘వాట్‌ ఏ ఐడియా సర్‌ జీ’, ‘టీమ్‌ వర్క్‌తో ఏదైనా సాధించవచ్చు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కండ బలం కంటే బుద్ధి బలమే గొప్పదని పేర్కొంటున్నారు.

Also read:

Prabhas: ఆదిపురుష్ కోసం అలా మారనున్న డార్లింగ్.. ఓం రౌత్‌కి బిగ్ థ్యాంక్స్ చెప్పిన నాగీ..

Virat Kohli: 2023 వన్డే ప్రపంచ కప్‌ కోసమే టీ20 కెప్టెన్సీ వదిలేశాడా..? కోహ్లీ ప్లాన్ మాములుగా లేదంటోన్న మాజీలు

Andhra Pradesh: ఆ గ్రామంలో కోతుల విశ్వరూపం.. రంగంలోకి కొండముచ్చు.. వీధి వీధిలో తిప్పుతూ..