Virat Kohli: 2023 వన్డే ప్రపంచ కప్‌ కోసమే టీ20 కెప్టెన్సీ వదిలేశాడా..? కోహ్లీ ప్లాన్ మాములుగా లేదంటోన్న మాజీలు

2014-15 ఆస్ట్రేలియా పర్యటనలో విరాట్ కోహ్లీ మొదట టీమిండియా కెప్టెన్ అయ్యాడు. ఎంఎస్ ధోనీ పదవీ విరమణ తర్వాత కోహ్లీ టెస్ట్ జట్టు సారథిగా మారాడు.

Virat Kohli: 2023 వన్డే ప్రపంచ కప్‌ కోసమే టీ20 కెప్టెన్సీ వదిలేశాడా..? కోహ్లీ ప్లాన్ మాములుగా లేదంటోన్న మాజీలు
Virat Kohli
Follow us

|

Updated on: Sep 17, 2021 | 7:54 AM

Virat Kohli: విరాట్ కోహ్లీ భారత టీ 20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. టీ 20 వరల్డ్ కప్ (2021 T20 World Cup) తర్వాత విరాట్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడు. టీ20, వన్డే కెప్టెన్సీ నుంచి వైదొలగవచ్చనే ఊహాగానాలు చాలా రోజులుగా ఉన్నాయి. అయితే దీనిని బీసీసీఐ ఖండించింది. జట్టు గెలిచినంత కాలం, అలాంటి మార్పు ఉండదని పేర్కొంది. కానీ, ఐపీఎల్ 2021 ప్రారంభానికి మూడు రోజుల ముందు, టీ20 ప్రపంచ కప్‌కు ఒక నెల ముందు, విరాట్ కోహ్లీ టీ20 కెప్టెన్సీకి వీడ్కోలు చెప్పాలని నిర్ణయించుకున్నాడు.

ఈ మేరకు కోహ్లీ తన ట్విట్టర్ పేజీలో ఒక ప్రకటనను పోస్ట్ చేశాడు. ‘అక్టోబర్‌ నుంచి దుబాయ్‌లో జరిగే టీ20 ప్రపంచ కప్ తర్వాత నేను టీ 20 కెప్టెన్‌గా వైదొలగాలని నిర్ణయించుకున్నాను. నేను టీ 20 కెప్టెన్‌గా ఉన్న సమయంలో జట్టుకు నా సర్వస్వం ఇచ్చాను’ అంటూ రాసుకొచ్చాడు. ఈ నిర్ణయం ద్వారా విరాట్ కోహ్లీ టీ 20 జట్టు కెప్టెన్‌ని విడిచిపెట్టి, 2023 వరల్డ్ కప్ వరకు వన్డే క్రికెట్‌లో తన కెప్టెన్సీని అలాగే ఉంచుకున్నాడు. ఐసీసీ ట్రోఫీని గెలవాలనే ఒత్తిడి అతనిపై ఉంది. ఈ కారణంగా, అతని కెప్టెన్సీ కూడా పలు విమర్శలకు దారి తీసింది.

ఓ మచ్చలా మిగిలిన ఐసీసీ ట్రోఫీ కోహ్లీ నాయకత్వంలో భారత్ 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, 2019 ప్రపంచ కప్ ఆడింది. కానీ, ఈ రెండు టోర్నమెంట్లలో భారత జట్టు టైటిల్‌కు దూరంగా నిలిచింది. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ అతనిని ఫైనల్‌లో ఓడించింది. వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ సెమీ ఫైనల్స్ నుంచి నిష్క్రమించింది. తొలి ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో ఓడిపోవడం కూడా నిరాశకు గురి చేసింది. అందువల్ల, ఐదేళ్లలో మూడు ఐసీసీ టోర్నమెంట్‌లను గెలవడంలో విఫలం కావడంతో కోహ్లీపై ఒత్తిడి చాలా ఉంది.

టీ 20 వరల్డ్ కప్ తర్వాత ఈ ఫార్మాట్‌లో భారత జట్టు కెప్టెన్సీని విడిచిపెట్టాలనే నిర్ణయంతో తనపై లేవనెత్తిన ప్రశ్నలను చాలా వరకు పక్కన పెట్టాడు కోహ్లీ. దీనితో పాటు, ఈ నిర్ణయం ద్వారా అతను చాలా ముఖ్యమైన పని కోసం చాలా తెలివిగా సిద్ధమయ్యాడు.

టీ 20 వరల్డ్ కప్ తర్వాత టీ 20 కెప్టెన్సీ నుంచి వైదొలగాలని కోహ్లీ నిర్ణయించుకున్నాడు. కెప్టెన్‌గా టీ 20 ప్రపంచకప్ ఆడలేదు. ప్రస్తుతం ఈ ఘనతను కూడా సాధిస్తారు.

కోహ్లీ 2021 టీ 20 వరల్డ్ కప్ గెలిస్తే, అతను ఐసీసీ ట్రోఫీని గెలవలేదనే మరకను తొలగించడమే కాకుండా భారతదేశ ఎనిమిది సంవత్సరాల కరువును కూడా అంతం చేస్తాడు. ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో 2013 లో ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ 2013 లో చివరిసారిగా ఐసీసీ టోర్నమెంట్ గెలిచింది. అతను గెలవకపోయినా ఇప్పటికే కెప్టెన్సీని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు.

టీ 20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా 2023 వరకు కోహ్లీ వన్డే కెప్టెన్సీపై ఎలాంటి ప్రశ్నలు లేవనెత్తరు. ఎందుకంటే అప్పుడు రోహిత్ శర్మ కూడా ఒక ఫార్మాట్‌లో కెప్టెన్‌గా ఉండే అవకాశం ఉంది. అప్పుడు రోహిత్ కెప్టెన్సీని పొందడం ముఖ్యం కాదు. స్ప్లిట్ కెప్టెన్సీ కోరుకునే వారి కోరిక కూడా నెరవేరుతుంది. దీంతో పాటు 2023 ప్రపంచ కప్‌లో కోహ్లీ తనను తాను నిరూపించుకునే మార్గం కూడా క్లియర్ అవుతుంది.

Also Read: Virat Kohli: ఆస్ట్రేలియా నుంచి ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా వరకు.. కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ రికార్డులు ఎలా ఉన్నాయంటే?

Kohli Vs Rohit: మరోసారి బయటపడ్డ కోహ్లీ-రోహిత్ విభేదాలు.. వైస్ కెప్టెన్సీ నుంచి తొలగించాలంటూ బీసీసీఐకి ప్రతిపాదించిన కెప్టెన్?