Kohli Vs Rohit: మరోసారి బయటపడ్డ కోహ్లీ-రోహిత్ విభేదాలు.. వైస్ కెప్టెన్సీ నుంచి తొలగించాలంటూ బీసీసీఐకి ప్రతిపాదించిన కెప్టెన్?
2017 లో మహేంద్ర సింగ్ ధోనీ స్థానంలో భారత పరిమిత ఓవర్ల జట్టుకు విరాట్ కోహ్లీ కెప్టెన్ అయ్యాడు. కోహ్లీ 90 టీ 20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 28 హాఫ్ సెంచరీలతో 3159 పరుగులు చేశాడు.
Virat Kohli Vs Rohit Sharma: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరగనున్న టీ 20 వరల్డ్ కప్ (2021 T20 వరల్డ్ కప్) తర్వాత విరాట్ కోహ్లీ భారత టీ 20 కెప్టెన్‌గా వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. 32 ఏళ్ల క్రికెటర్ తన ట్విట్టర్‌లో ఒక ప్రకటనను చేశాడు. “అక్టోబర్‌లో దుబాయ్‌లో జరిగే టీ20 ప్రపంచ కప్ తర్వాత నేను టీ20 కెప్టెన్‌గా వైదొలగాలని నిర్ణయించుకున్నాను.” ఈ నిర్ణయం తర్వాత, టీ 20 లో టీమిండియా కెప్టెన్సీని రోహిత్ శర్మ చేపట్టడానికి మార్గం సుగమమైంది. వైట్-బాల్ జట్టు కెప్టెన్‌గా కోహ్లీ భవిష్యత్తుపై కొంతకాలంగా ఊహాగానాలు ఉన్నాయి. ప్రత్యేకించి ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రోహిత్ శర్మ అద్భుతమైన రికార్డును అందించారు. దీనిలో అతను ముంబై ఇండియన్స్‌కు ఐదు టైటిల్స్ అందించాడు.
34 ఏళ్ల రోహిత్ వన్డే, టీ 20 ఫార్మాట్లలో భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. అతను టీ 20 కెప్టెన్ పాత్ర పోషించే అన్ని అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ ఏడాది చివర్లో న్యూజిలాండ్‌తో జరిగే స్వదేశీ సిరీస్‌లో అతను కెప్టెన్‌గా భారత టీ 20 లో అరంగేట్రం చేయవచ్చు. కానీ భారత క్రికెట్ కారిడార్ల నుంచి భిన్నమైన వార్తలు వస్తున్నాయి. రోహిత్ శర్మను వైస్ కెప్టెన్ పదవి నుంచి తొలగించాలని విరాట్ కోహ్లీ భావించినట్లు తెలిసింది. పీటీఐ నివేదిక ప్రకారం, కోహ్లీ వన్డే-టీ20 వైస్ కెప్టెన్సీ నుంచి రోహిత్‌ను తొలగించాలనే ప్రతిపాదనతో సెలక్టర్ల వద్దకు వెళ్ళాడనే వార్తలు వెలువడ్డాయి. రోహిత్‌కు 34 ఏళ్లు వచ్చాయని ఆయన అన్నారు. అటువంటి పరిస్థితిలో, కేఎల్ రాహుల్‌ను వన్డేల్లో వైస్ కెప్టెన్‌గా, టీ20 లో రిషబ్ పంత్‌ని నియమించాలని ఆయన ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మకు అంతగా సెట్ కాలేదు. ఇద్దరి మధ్య చాలా భేదాభిప్రాయాలు ఉన్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
కోహ్లీ నిజంగా వారసుడిని కోరుకోలేదని వారు విశ్వసించినందున ఈ ప్రతిపాదన బోర్డుకు నచ్చలేదని, ఓ బీసీసీఐ అధికారి తెలిపినట్లు పీటీఐ తెలిపింది. 2023 వరల్డ్ కప్ వరకు కోహ్లీ తన కెప్టెన్సీని కాపాడాలని బీసీసీఐ అధికారులు అంగీకరించారు. సుదీర్ఘ కాలంలో కోహ్లీ చాలా మందిని తొలగించినట్లు తెలుస్తుంది. ఇందులో ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, సెలెక్టర్లు, బోర్డు అనుభవజ్ఞులు కూడా ఉన్నారు.
2017 లో కెప్టెన్‌గా కోహ్లీ 2017 లో మహేంద్ర సింగ్ ధోనీ స్థానంలో కోహ్లీ భారత పరిమిత ఓవర్ల జట్టుకు కెప్టెన్ అయ్యాడు. కోహ్లీ 90 టీ 20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 28 హాఫ్ సెంచరీలతో 3159 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లలో 45 టీ20లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 27 టీ20ల్లో జట్టుకు విజయాలు అందించాడు. అయితే జట్టు 14 టీ20ల్లో ఓడిపోయింది. కోహ్లీ విజయం శాతం 65.11గా ఉంది. టీ 20 ప్రపంచకప్ అక్టోబర్ 17 నుంచి ప్రారంభం కానుంది. కెప్టెన్‌గా అతని చివరి టోర్నమెంట్‌లో ట్రోఫీని గెలవాలని కోహ్లీపై విపరీతమైన ఒత్తిడి ఉంటుంది.
Also Read: Virat Kohli: అకస్మాత్తు నిర్ణయమా.. ఆలోచించి తీసుకున్నాడా.. కోహ్లీ తప్పుకోవడంపై అసలు కారణమేంటి?
Virat Kohli: విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం.. టీ20 కెప్టెన్సీకి గుడ్ బై..