Virat Kohli: విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం.. టీ20 కెప్టెన్సీకి గుడ్ బై..
India T20 Captain: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా అధికారిక ప్రకటన చేశాడు.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అక్టోబర్ నుంచి యూఏఈ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ తర్వాత నుంచి టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలగనున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా భావోద్వేగపూరితమైన లేఖను ట్వీట్ చేశాడు. టెస్టులు, వన్డేలకు కెప్టెన్‌గా కొనసాగుతానని తెలిపాడు.
”గత 8-9 ఏళ్లుగా టీమిండియాకు సేవలు అందిస్తున్నాను. అలాగే 5-6 ఏళ్ల నుంచి మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాను. ఒకవైపు కెప్టెన్‌గా, మరోవైపు ప్లేయర్‌గా కొనసాగడం నిరంతర వర్క్ లోడ్‌కు నిదర్శనం. ఇంతకాలం ఎంతో భారాన్ని మోస్తూ వచ్చాను. ఆ భారాన్ని తగ్గించుకునేందుకు టీ20లకు కెప్టెన్‌గా తప్పుకోవాలని నిర్ణయించాను. ఈ విషయంపై కోచ్ రవిశాస్త్రి, రోహిత్ శర్మలతో చర్చించాను. కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా.. టీ20ల్లో బ్యాట్స్‌మెన్‌గా కొనసాగుతాను. టీ20 ప్రపంచకప్ అనంతరం కెప్టెన్సీ నుంచి వైదొలుగుతా. ఈ నిర్ణయాన్ని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, జయ్ షాలకు తెలియజేశాను. నాకు అండగా నిలిచిన సపోర్ట్ స్టాఫ్, కోచ్‌లు, సహచర ఆటగాళ్ళకు ధన్యవాదాలు. మీవల్లే నేను ఇంత వాడినయ్యాను” అని కోహ్లీ భావోద్వేగమైన ట్వీట్ చేశాడు.
కాగా, టీ20ల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోనున్నట్లు గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఆ విషయంపై ఇవాళ కోహ్లీ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. అలాగే టీం నిర్ణయాల్లో రోహిత్ ఓ భాగమని.. జట్టుకు కీలకమైన ఆటగాడని కోహ్లీ తన లేఖలో హిట్‌మ్యాన్ గురించి ప్రస్తావించడంతో టీ20లకు నెక్స్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ అవుతాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
?? ❤️ pic.twitter.com/Ds7okjhj9J
— Virat Kohli (@imVkohli) September 16, 2021
Read Also: ఈ ఫోటోలోని జింకను కనిపెట్టండి.. మీ మెదడుకు మేత వేయండి.. ఈజీగా కనిపెట్టొచ్చు..
గాల్లో ఢీకొన్న రెండు విమానాలు.. దూకేసిన ప్రయాణీకులు.. చివరికి ఏం జరిగిందంటే.!
గజరాజుకు కోపమొస్తే ఇంతేనేమో.. అడవి దున్నను కుమ్మేసిందిగా.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారంతే.!