AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆంజనేయ స్వామి రథోత్సవానికి హెలికాప్టర్ తో పూలు చల్లిన కర్ణాటక ఎమ్మెల్యే.. ఎక్కడంటే..

గడిచిన రెండుసార్లు చిత్రదుర్గం నుంచి హెలికాప్టర్లో వచ్చి రథోత్సవం రోజు పూలు చలి వెళ్లే ఎమ్మెల్యే రఘుమూర్తి... ఈ ఏడాది కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమలినేని సురేంద్రబాబు ద్వారా హెలిపాడ్ ఏర్పాటు కోసం పోలీసుల అనుమతి తీసుకుని.. రథోత్సవంలో హెలికాప్టర్ తో పూలు చల్లారు... వరుసగా మూడవ ఏడాది కూడా హెలికాప్టర్లో వచ్చి రథోత్సవానికి పూలు చల్లడంతో స్థానికులు ఆశ్చర్యంగా చూస్తున్నారు.

ఆంజనేయ స్వామి రథోత్సవానికి హెలికాప్టర్ తో పూలు చల్లిన కర్ణాటక ఎమ్మెల్యే.. ఎక్కడంటే..
Hanuman Devotion
Nalluri Naresh
| Edited By: |

Updated on: Mar 03, 2025 | 1:02 PM

Share

సాధారణంగా రాజకీయ నాయకులకి సెంటిమెంట్స్ ఎక్కువగానే ఉంటాయి. ఒక్కో రాజకీయ నాయకుడు ఒక్కో దేవుడిని ఇష్ట దైవంగా కొలుస్తారు. అలాగే ఓ నాయకుడు వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలవడంతో అయినప్పటి నుంచి ఆంజనేయస్వామిని భక్తిశ్రద్ధలతో కొలిచాడు… వరుసుగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడంతో… 2023 నుంచి ప్రతి ఏడాది ఆంజనేయస్వామి రథోత్సవానికి హెలికాప్టర్ తో పూలు చల్లి తన భక్తిని చాటుకుంటున్నాడు. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం వడ్డెపాల్యం శ్రీ వీరాంజనేయస్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది.

ఆంధ్ర కర్ణాటక రాష్ట్రం నుంచి వేలాదిగా భక్తులు రథోత్సవంలో పాల్గొంటారు. అలాగే కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గం జిల్లా చెల్లెకేరే నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రఘుమూర్తి వరుసగా మూడుసార్లు గెలిచాడని… శ్రీ వీరాంజనేయ స్వామి మీద ఉన్న భక్తితో… 2023 నుంచి హెలికాప్టర్ నిండా పూలు పెట్టుకొని రథోత్సవం రోజు వడ్డెపాల్యం గ్రామంపై చక్కెర్లు కొడుతూ రథోత్సవంలో పూలు చల్లి వెళ్లిపోయేవారు. అలాగే ఈ ఏడాది కూడా రథోత్సవం రోజు హెలికాప్టర్ లో వచ్చి పూలు చల్లి తన భక్తిని చాటుకున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

గడిచిన రెండుసార్లు చిత్రదుర్గం నుంచి హెలికాప్టర్లో వచ్చి రథోత్సవం రోజు పూలు చలి వెళ్లే ఎమ్మెల్యే రఘుమూర్తి… ఈ ఏడాది కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమలినేని సురేంద్రబాబు ద్వారా హెలిపాడ్ ఏర్పాటు కోసం పోలీసుల అనుమతి తీసుకుని.. రథోత్సవంలో హెలికాప్టర్ తో పూలు చల్లారు… వరుసగా మూడవ ఏడాది కూడా హెలికాప్టర్లో వచ్చి రథోత్సవానికి పూలు చల్లడంతో స్థానికులు ఆశ్చర్యంగా చూస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్