Viral: తాళికట్టే వేళ వరుడి ఫోన్ ఒక్కసారిగా మోగింది.. ఎవరా అని చూడగా మైండ్ బ్లాంక్
మరికాసేపట్లో పెళ్లి.. వధూవరుల కుటుంబ సభ్యులు అందరి సమక్షంలో జరుగుతోంది. మరికొద్ది నిమిషాల్లో ముహూర్త సమయం ఉంది. అయితే ఇంతలో వరుడి మొబైల్ రింగ్ అయ్యింది. ఎవరా అని చూడగా.. స్క్రీన్‌పై కనిపించిన దృశ్యానికి వరుడికి మైండ్ బ్లాంక్ అయింది.

మరికాసేపట్లో పెళ్లి.. వధూవరుల కుటుంబ సభ్యులు అందరి సమక్షంలో జరుగుతోంది. మరికొద్ది నిమిషాల్లో ముహూర్త సమయం ఉంది. అయితే ఇంతలో వరుడి మొబైల్ రింగ్ అయ్యింది. ఎవరా అని చూడగా.. స్క్రీన్‌పై కనిపించిన దృశ్యానికి వరుడికి మైండ్ బ్లాంక్ అయింది. వెంటనే పెళ్లి పీటలపై నుంచి లేచి.. వెళ్లిపోయాడు. ఇక వరుడు చేసిన ఈ పనికి మండపంలో ఉన్నవారందరూ దెబ్బకు షాక్ అయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో చోటుచేసుకుంది.
ఇది చదవండి: నిద్రపోయే భంగిమను బట్టి మీ వ్యక్తిత్వాన్ని చెప్పేయొచ్చు..! ఎలాగో తెల్సా
పెళ్లి ముహూర్తం దగ్గర పడుతున్న వేళ.. వరుడికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. అదేమో చేసింది వధువు మాజీ ప్రియుడు. తామిద్దరం ఎన్నో ఏళ్లుగా ప్రేమించుకుంటున్నామని.. అందుకు సాక్ష్యమే ఇవి అని.. వరుడు మొబైల్‌కి పెళ్లికూతురుతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వారిద్దరి ప్రైవేటు వీడియోలు పంపించాడు ఆమె మాజీ ప్రేమికుడు. ఇక అవి చూసిన వరుడు దెబ్బకు పెళ్లి మధ్యలోనే ఆపేసి.. అక్కడ నుంచి వెళ్లిపోయాడు. వరుడు ఇలా చేయడంతో అసలేం జరిగిందోనని వధువు తరపు బంధువులు ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. వధువు మాజీ ప్రేమికుడు ఇదంతా చేశాడని తెలియడంతో.. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు వధువు కుటుంబసభ్యులు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు సదరు నిందితుడిపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు. కాగా, వధువు మాజీ ప్రేమికుడిగా చెప్పబడుతున్న వ్యక్తి కమల్ సింగ్‌గా గుర్తించారు పోలీసులు.
ఇది చదవండి: ఆషాడంలో భార్యాభర్తలు కలిస్తే ఏమవుతుందో తెల్సా.? ఎందుకు కలిసి ఉండకూడదంటే
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




