Viral Video: ఫొటోగ్రాఫర్‌పై పడగెత్తిన పాము..పరుగులంకించుకున్నా వదల్లేదు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
అడవిలో మనకు ఎన్నో జంతువులు కనిపిస్తుంటాయి. అందులో కొన్ని సాధు జంతువులైతే మరికొన్ని క్రూర జంతువులు. అనుకోకుండా మనపై దాడి చేస్తుంటాయి.
అడవిలో మనకు ఎన్నో జంతువులు కనిపిస్తుంటాయి. అందులో కొన్ని సాధు జంతువులైతే మరికొన్ని క్రూర జంతువులు. అనుకోకుండా మనపై దాడి చేస్తుంటాయి. ముఖ్యంగా సింహం, పులి, ఎలుగుబంట్లకు ఎంతో దూరంగా ఉండాలి. వాటి కంటికి కనిపిస్తే అంతే సంగతులు. ఇక అడవి అన్నాక పాములుండడం ఎంతో సహజం. అయితే పాముల్లో కూడా చాలా రకాలున్నాయి. ప్రపంచంలో 2 వేలకు పైగా జాతుల పాములు ఉంటే వాటిలో కొన్ని మాత్రమే విషపూరితమైనవి, ప్రమాదకరమైనవి. అయితే చాలా పాములు మనుషులను చూడగానే భయపడిపోతాయి. దూరంగా పారిపోతాయి. కానీ కొన్ని సార్లు పాములే మనుషులపైఎదురుదాడికి దిగుతాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లోవైరల్‌గా మారింది. నెటిజన్లందరూ ఈ వీడియోను చూసి ఆశ్చర్యపోతున్నారు.
చావును పరిచయం చేసింది..
ఈ వీడియోలో ఒక వ్యక్తి అడవిలో ఫొటోలు తీయడానికి వెళతాడు. అడవి అందాలతో పాటు అక్కడ కనిపించిన జంతువులను తన కెమెరాల్లో బంధిస్తాడు. అయితే ఇంతలో ఒక పాము బుసలు కొడుతూ ఫొటోగ్రాఫర్‌కు ఎదురుపడుతుంది. అతనిని కాటు వేసేందుకు ప్రయత్నిస్తుంది. దీంతో ఒక్కసారిగా అక్కడి నుంచి పరుగు లంకించుకుంటాడు ఆ ఫొటోగ్రాఫర్. కానీ పాము మాత్రం అతడిని విడిచిపెట్టదు. వేటాడి వెంటాడి ముచ్చెమటలు పట్టిస్తుంది. అదృష్టవశాత్తూ సదరు వ్యక్తి పాము బారి నుంచి తప్పించుకున్నా. మృత్యువును మాత్రం చాలా దగ్గరుండి చూశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు సుమారు 6 లక్షల మందికి పైగా ఈ వీడియోను చూశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ‘ఈ ఫొటోగ్రాఫర్‌కు ఇంకా భూమ్మీద నూకలున్నాయి’, అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
View this post on Instagram
Also Read:Viral Video: ఈ కింగ్ కోబ్రా దాడి చూస్తే దడ పుట్టాల్సిందే.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో