Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఫైర్ మోమోస్ ఎప్పుడైనా చూశారా.. వైరల్‎గా వీడియో..

తందూరీ, చీజీ, పాన్-ఫ్రైడ్ - పైపింగ్ హాట్ మోమోస్‎లో ఎవరికి ఇష్టమున్నది వారు తినేస్తారు. ఇవి కాకుండా మీరు గోల్డ్ మోమో, పిజ్జా మోమో వంటి కొత్త, విచిత్రమైన మోమోలను చూసి ఉండవచ్చు. కానీ మీరు ఎప్పుడైనా మంటల్లో ఉండే మోమోలు చూశారా?...

Viral Video: ఫైర్ మోమోస్ ఎప్పుడైనా చూశారా.. వైరల్‎గా వీడియో..
Fire
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Nov 01, 2021 | 8:34 PM

తందూరీ, చీజీ, పాన్-ఫ్రైడ్ – పైపింగ్ హాట్ మోమోస్‎లో ఎవరికి ఇష్టమున్నది వారు తినేస్తారు. ఇవి కాకుండా మీరు గోల్డ్ మోమో, పిజ్జా మోమో వంటి  విచిత్రమైన మోమోలను చూసి ఉండవచ్చు. కానీ మీరు ఎప్పుడైనా మంటల్లో ఉండే మోమోలు చూశారా? ఉత్తరప్రదేశ్‎లోని ఘజియాబాద్‌లో ఓ రోడ్‌సైడ్ స్టాల్ ఫైర్ మోమోలను విక్రయిస్తోంది. దానిని ఒక్కసారి చూస్తే మీ వింతగా అనిపిచ్చొచ్చు కానీ తింటే బాగుంటుందటా.. దీని తయారిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.

పైదైషి ఫుడీ అనే ఫుడ్ బ్లాగర్ హార్దిక్ మాలిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో పోస్ట్ చేశారు. విక్రేత పాన్‌లో కొన్ని మోమోలను వేయించి, ఆపై కొన్ని కూరగాయలను అందులో వేశాడు. పాన్ మొత్తం మంటలు అంటుకునే విధంగా వ్యక్తి మోమోస్‌ను వేయించాడు. అప్పుడు అందులో కొన్ని మసాలాలు వేశాడు. ఘజియాబాద్‌లోని ఇందిరాపురంలోని జైపురియా మార్కెట్‌లో టెంజీ మోమోస్ అనే స్టాల్ ఉంది. ఈ వీడియోకు 88,000 లైక్‌లు అనేక కామెంట్లు వచ్చాయి. దీన్ని చూసి ఢిల్లీ బెల్లీలో కునాల్ రాయ్ కపూర్ పాత్రకు లూసీని అందించిన స్పైసీ రెడ్ చికెన్‌ను కొంతమంది గుర్తుకు తెచ్చుకుంటున్నారు.

కొద్ది రోజుల క్రితం నాగపూర్‎లోని ప్రతాప్ నగర్‌ వీధి ఆహార విక్రేత చిరాగ్ కా చస్కా బాహుబలి పానీ పూరి తయారు చేసి అందరిని ఆకర్షించాడు. పెద్ద పానీ పూరి తీసుకుని అందులో రకరకాల చట్నీలు, పానీతో నింపుతాడు. ఇమ్లీ చట్నీ, రెగ్యులర్ పానీ, సీజనల్ ఆరెంజ్ ఫ్లేవర్డ్ పానీ, జీరా (జీలకర్ర) పానీ, వెల్లుల్లి పానీ పానీ పూరీ లోపల నింపి.. దానిపై బంగాళాదుంప కూరను స్తూపాకరంగా నింపుతాడు. చివరగా పెరుగు, బూందీ, సేవ్, దానిమ్మపండుతో నింపి బాహుబలి పానీ పూరి తయారు చేస్తాడు. ఆసక్తికరమైన బాహుబలి పానీ పూరీ చాలా రుచికరంగా ఉన్నప్పటికీ తినడానికి ఇబ్బందిగా ఉంది. “దీన్ని ఎలా తినాలో మీరు వీడియో కూడా చేయాలి” అని ఒక వినియోగదారు వ్యాఖ్యానించారు.

Read Also… Viral Video: ఈ ఏనుగు పిల్ల చేసిన పనికి నవ్వకుండా ఉండలేరు.. వైరలవుతోన్న వీడియో..