G20 Summit: హిందీలో ఇరగదీసిన అమెరికా అధికార ప్రతినిధి..ఇంగ్లీష్‌ యాసలో ఇచ్చిపడేసింది..!! సోషల్‌ మీడియాలో దుమ్ములేపుతున్న వీడియో..

జీ20 సదస్సు సందర్భంగా జర్నలిస్టు అడిగిన ప్రశ్నలకు అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మార్గరెట్ మెక్‌లియోడ్ హిందీలో సమాధానమిచ్చారు. ఒక రిపోర్టర్ మార్గరెట్‌ను హిందీలో ప్రశ్నలు అడిగారు. దానికి ఆమె హిందీలోనే సమాధానమిచ్చింది. అమెరికా యాసతో హిందీ మాట్లాడే ఓ విదేశీ మహిళ వివరణతో మార్గరెట్ మెక్‌లియోడ్ స్పందన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

G20 Summit: హిందీలో ఇరగదీసిన అమెరికా అధికార ప్రతినిధి..ఇంగ్లీష్‌ యాసలో ఇచ్చిపడేసింది..!!  సోషల్‌ మీడియాలో దుమ్ములేపుతున్న వీడియో..
us spokesperson speaks in hindi
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 10, 2023 | 1:35 PM

ప్రపంచ నాయకులు G20 సమ్మిట్‌లో పాల్గొంటున్నారు. అయితే US దౌత్యవేత్త మార్గరెట్ మెక్‌లియోడ్ అందరి దృష్టిని ముఖ్యంగా భారతీయులను ఆకర్షించారు. సదస్సులో హిందీలో మాట్లాడుతూ.. అందరినీ ఆశ్చర్యపరిచారు. మార్గరెట్ మాట్లాడిన ప్రసంగంతో ఆమె వెనుక ఉన్న చరిత్రపై ప్రజలు ఫోకస్‌ చేసేలా చేసింది. జీ20 సదస్సు సందర్భంగా జర్నలిస్టు అడిగిన ప్రశ్నలకు అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మార్గరెట్ మెక్‌లియోడ్ హిందీలో సమాధానమిచ్చారు. ఒక రిపోర్టర్ మార్గరెట్‌ను హిందీలో ప్రశ్నలు అడిగారు. దానికి ఆమె హిందీలోనే సమాధానమిచ్చింది. ఈ సదస్సులో ప్రపంచ శాంతికి సంబంధించిన చర్చలు ఉంటాయని, భారత్‌తో కలిసి పనిచేసేందుకు అమెరికా ఎప్పుడూ సిద్ధంగా ఉందని మార్గరెట్ తెలిపారు. మార్గరెట్ భారతదేశం సంపద వృద్ధి గురించి, ప్రపంచవ్యాప్తంగా తన స్థానాన్ని పొందేందుకు దాని ప్రయత్నాల గురించి హిందీలో మాట్లాడారు.

అమెరికా యాసతో హిందీ మాట్లాడే ఓ విదేశీ మహిళ వివరణతో మార్గరెట్ మెక్‌లియోడ్ స్పందన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనితో పాటు ప్రపంచంలోని మహిళ ఎవరు, ఆమె పాత్ర ఏమిటి అనే సందేహాలు సోషల్ మీడియా వేదికగా సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. మార్గరెట్ ప్రపంచంలోని హిందీ, ఉర్దూ భాషా సంఘాలను ఉద్దేశించి నియమించిన US స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి. హిందీ, ఉర్దూ భాషా విభాగాల మధ్య US విదేశాంగ విధానం, ఇతర ప్రాజెక్టులను వివరించడం వారి ప్రధాన కర్తవ్యం.

ఫారిన్ సర్వీస్ ఆఫీసర్, మార్గరెట్ విదేశాలలో అనేక మిషన్లలో భాగంగా పనిచేశారు. మార్గరెట్ భారతదేశం, పాకిస్తాన్, జపాన్ వంటి దేశాలలో US ప్రాజెక్ట్‌లలో కూడా పాల్గొంది. మార్గరెట్ కొలంబియా విశ్వవిద్యాలయం నుండి సుస్థిర అభివృద్ధిలో డాక్టరేట్ పొందారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో రోటరీ స్కాలర్‌గా ఉన్నారు. మార్గరెట్‌కి హిందీ, ఉర్దూ మాట్లాడడం వచ్చు. కానీ, రాయడం మాత్రమే రాదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..