Viral Video: కత్తి నూరుతున్న కోతి.. ఎవరికి మూడిందో మరి.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో..!

Viral Video: సహజంగానే కోతి నానా రచ్చ చేస్తుంది. దానికి తిక్కరేగిందంటే అంతే సంగతి. ఎదుటి వారు ఎంతటి వారైనా, ఎంతటి బలవంతులైనా సినిమా కనిపించాల్సిందే.

Viral Video: కత్తి నూరుతున్న కోతి.. ఎవరికి మూడిందో మరి.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో..!
Monkey
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 11, 2021 | 1:13 PM

Viral Video: సహజంగానే కోతి నానా రచ్చ చేస్తుంది. దానికి తిక్కరేగిందంటే అంతే సంగతి. ఎదుటి వారు ఎంతటి వారైనా, ఎంతటి బలవంతులైనా సినిమా కనిపించాల్సిందే. ఇలాంటి ఘటనలు మనం కొకొల్లలుగా చూశాం. చూస్తూనే ఉన్నాం. కోతుల అల్లరి ఆకట్టుకుంటుంది కాబట్టే.. వాటికి సంబంధించి సోషల్ మీడియాలో ఎన్నో అద్భుతమైన, ఫన్నీ వీడియోలో వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి ఓ కోతికి సంబంధించిన ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఆ వీడియోలో కోతి చేస్తున్న పని చూస్తే.. ఇవాళ ఎవరికో మూడింది రా అయ్యా అనిపించక మానదు. ఆ కోతి ఎవరిపైనో పగ తీర్చుకునే క్రమంలో ఇలాంటి చర్యకు ఒడిగట్టిందని అనిపిస్తుంది.

సాధారణంగా కోతి నుంచి మనిషి వచ్చాడంటారు. కానీ, మనుషులను చూసి కోతులు చాలా విషయాలు నేర్చుకుంటాయనేది అక్షర సత్యం. అయితే, కొన్ని కోతులు మంచి విషయాలు నేర్చుకుంటే.. మరికొన్ని కోతులు చెడు అంశాలను గ్రహిస్తాయి. గతంలో ఓ కోతి మద్యానికి బానిసై రోజూ మద్యం దుకాణానికి వెళ్లి మద్యం సేవించిన ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా అలాంటి సంచలన వీడియో ఒకటి నెట్టింట్లో హల్‌చల్ చేస్తుంది. అది చూసి నెటిజన్లు వామ్మో అని హడలిపోతున్నారు.

ఇంతకీ ఆ వీడియోలో ఏముంది? ఆ కోతిని చూసి అంతలా భయపడటానికి కారణం ఏంటి? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియోలో ఓ కోతి ఎక్కడి నుంచి తీసుకువచ్చిందో గానీ ఓ మందమైన కత్తిని పట్టుకొచ్చింది. దానిని నీటితో శుభ్రపరిచింది. ఆ తరువాత ఆ కత్తికి సాన పెట్టడం మొదలు పెట్టింది. ఓ రాతిపై కత్తిని నూరుతూ.. నీటి సాయంతో సాన పెట్టింది. మధ్య మధ్యలో కత్తి పదునును చెక్ చేయడం కొసమెరుపు. ఇలా కాసేపు కత్తి పదునుగా మారేంత వరకు సాన పెట్టింది. అయితే, కోతి కత్తిని సాన పెట్టడాన్ని వీడియో తీసిన వ్యక్తులు దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఆ వీడియోను చూసి నెటిజన్లు వామ్మో.. ఇదేం కోతిరా అయ్యా.. ఇవ్వాలని ఎవరికో మూడినట్లుంది. ఎవరి మీద రివేంజ్ తీసుకుంటుందో ఏమో అంటూ హడలిపోతూ రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. మరెందుకు ఆలస్యం.. ఈ షాకింగ్ వీడియోను మీరూ చూసేయండి.

Viral Video:

Also read:

Samantha: విడాకులపై మరోసారి స్పందించిన సమంత.. వచ్చే ఏడాది అలాంటి జీవితం కావాలంటూ..

Fact Check: కరోనా టీకా తీసుకుంటే మూడు నెలల పాటు ఫ్రీ రీఛార్జ్‌!.. ఈ వార్త నిజమేనా?

Virat Kohli: బీసీసీఐ నిర్ణయాన్ని తప్పుబట్టిన పాకిస్తాన్ మాజీ బౌలర్.. కోహ్లీకి సరైన గౌరవం ఇవ్వలేదని వ్యాఖ్యలు..