Viral: నలుగురు విద్యార్ధులు తృప్తిగా భోజనం చేసి.. తీరా వెయిటర్ తెచ్చిన బిల్లు చూడగా అవాక్.!
సాధారణంగా మనం ఏదైనా హోటల్‌కు వెళ్లి భోజనం చేస్తే.? రూ. 100 లేదా రూ. 200 ఖర్చవుతుంది. అది ఫైవ్ స్టార్ హోటల్ అయితే..
సాధారణంగా మనం ఏదైనా హోటల్‌కు వెళ్లి భోజనం చేస్తే.? రూ. 100 లేదా రూ. 200 ఖర్చవుతుంది. అది ఫైవ్ స్టార్ హోటల్ అయితే.. స్పెషల్ ఫుడ్స్‌తో ఐదు వందలో, వెయ్యి అవుతుంది. ఇక్కడ ఓ నలుగురు విద్యార్ధులు రెస్టారెంట్‌కు వెళ్లి తృప్తిగా భోజనం చేశారు. కట్ చేస్తే.. వెయిటర్ తీసుకొచ్చిన బిల్లు చూసి దెబ్బకు కళ్లు తేలేశారు. చివరికి ఏం జరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే.. ఈ ఘటన ఇటలీలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
ఇటలీలోని సెయింట్ మార్క్ స్కేర్‌లో ఉన్న ఆస్టోరియా డా లుకా రెస్టారెంట్‌లో భోజనం చేశారు నలుగురు జపానీస్ విద్యార్ధులు. వారు నాలుగు ప్లేట్స్ భోజనంతో పాటు ఫోర్ ప్లేట్ స్లీక్, ఒక వాటర్ బాటిల్, ఫ్రైడ్ ఫిష్ ఆర్డర్ ఇచ్చారు. ఆ ఐటమ్స్ అన్నీ వచ్చాక వారంతా కూడా తృప్తిగా భోజనం చేశారు. తీరా వెయిటర్ బిల్లు తీసుకొచ్చాక.. దాన్ని చూసి దెబ్బకు ఖంగుతిన్నారు.
నలుగురు భోజనానికి ఏకంగా లక్ష రూపాయలు అయింది. ఇదేంటని రెస్టారెంట్ సిబ్బందిని అడగ్గా.. వారు ఇంటర్నెట్ హాట్‌స్పాట్ వాడినందుకు.. ఆ చార్జ్‌ను బిల్లులో వేశామని చెప్పారు. దీంతో అయోమయానికి గురైన ఆ నలుగురు.. ఇక చేసేదేమీ లేక విసుక్కుంటూ బిల్లు చెల్లించారు. అంతేకాదు ఆ తర్వాత రెస్టారెంట్ యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రూఫ్‌లతో సహా ఫిర్యాదులో ఆ నలుగురు విద్యార్ధులు పేర్కొన్నారు. కాగా, జరిగిన విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. నష్టపరిహారం కింద నలుగురు విద్యార్ధులకు రూ. 12.5 లక్షలు ఇప్పించారు.