Watch: చేపలు కొనేందుకు మార్కెట్‌కు వెళ్లిన మహిళ.. అక్కడ కనిపించిన ఫిష్ చూసి..బాబోయ్
సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాలైన వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో అప్పుడప్పుడు చేపలకు సంబంధించిన వార్తలు కూడా మనం చూస్తుంటాం.. కొన్ని చేపలు ఆకారంలో భారీ సైజుతో ఉంటే, మరికొన్న చేపలు వింత ఆకారంలో ఉంటుంటాయి. మరికొన్ని వాటి ధరతో ఫేమస్ అయితే, ఇంకొన్ని వాటి రుచితో ప్రజల్ని ఆకట్టుకుంటాయి. తాజాగా ఓ కొత్త జాతి చేపల్ని గుర్తించిన మహిళ ఆ షాకింగ్ వీడియోని ఇంటర్‌నెట్‌లో షేర్ చేసింది..ఈ చేప దంతాలు మనుషుల మాదిరిగానే ఉండటం సర్వత్ర ఆశ్చర్యయాంశంగా మారింది.

బ్రెజిలియన్ మహిళ ఒకరు ఇంట్లో చేపల కూర వండేందుకు చేపలు కొనుగోలు చేసేందుకు మార్కెట్‌కి వెళ్లింది. మార్కెట్ నుండి తనకు కావాల్సిన చేపలను కొనుగోలు చేసింది. గ్రిల్లింగ్ కోసం శుభ్రం చేస్తుండగా ఒక్కసారిగా ఆమె కళ్లు చేప పళ్లపై పడ్డాయి. చేప పళ్లను చూడగానే ఆమె కళ్లు బైర్లు కమ్మేసినట్టుగా అయింది. ఎందుకంటే.. ఆ చేప దంతాలు మనిషిలా కనిపించాయి. ఇంతకు ముందు ఏ చేప పళ్లనీ ఇలా చూడలేదని వాపోయింది.
ఆ చేపను సదరు మహిళ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నెటిజన్లు కూడా చేప పళ్ళు సాధారణం కంటే పెద్దవిగా, మానవ దంతాల ఆకారంలో ఉన్నట్లు గుర్తించారు. సముద్ర జీవశాస్త్రవేత్తల ప్రకారం, నీటిలో షెల్ఫిష్, ఇతర ఘన పదార్థాలను తినడానికి చేపలు మనిషి వంటి దంతాలను కలిగి ఉంటాయని అంటున్నారు. ప్రస్తుతం, జీవశాస్త్రవేత్తలు చేపల బరువు, పరిమాణం గురించి మరింత సమాచారాన్ని సేకరించడంలో బిజీగా ఉన్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..