Viral Video: చాలాకాలం తర్వాత సంరక్షకుడిని చూసి ఏనుగుల భావోద్వేగం.. నెటిజన్లను ఆకట్టుకుంటున్న వీడియో..
Elephants Viral Video: మానుషులు, జంతువుల మధ్య సంబంధం నిజంగా ప్రత్యేకమైనది. ఈ అవినాభావానికి సంబంధించి అందరి హృదయాలను గెలుచుకునే కథలు, వీడియోలు
Elephants Viral Video: మానుషులు, జంతువుల మధ్య సంబంధం నిజంగా ప్రత్యేకమైనది. ఈ అవినాభావానికి సంబంధించి అందరి హృదయాలను గెలుచుకునే కథలు, వీడియోలు చాలానే ఉన్నాయి. మనుషులు తమ ప్రపంచంలో సంతోషంగా ఉన్నట్లే, జంతువులు కూడా అడవిలో నివసించడానికి ఇష్టపడతాయన్న విషయం మనందరికీ తెలుసు. కానీ చాలా సార్లు ఇలాంటి దృశ్యాలు కనిపిస్తుంటాయి. మనిషికి మంచి స్నేహితులు జంతువులే అనిపిస్తుంది. ఈ వాస్తవాన్ని నిరూపించే వీడియో ఈ రోజుల్లో చాలా వేగంగా వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో.. ఏనుగుల గుంపు తమ సంరక్షకుడి వద్దకు వెళుతున్నట్లు చూడవచ్చు. ఈ వీడియోలో డెరెక్ థాంప్సన్ అనే వ్యక్తి నీటిలో నిలబడి ఉంటాడు. ఏనుగులు అతని సమీపంలోకి వస్తున్నాయి. అయితే.. ఏనుగులు థాంప్సన్‌ను తమ తొండెంతో సాదరంగా స్వాగతించాయి. థాంప్సన్ ఏనుగులను ప్రేమగా కౌగిలించుకొని.. వాటిని తడుముతాడ. నిజానికి ఈ ఏనుగులు 14 నెలల తర్వాత మళ్లీ తమ సంరక్షకుడిని కలుసుకున్నాయి.
వైరల్ వీడియో..
Elephants reunite with their caretaker after 14 months..
Sound on pic.twitter.com/wSlnqyuTca
— Buitengebieden (@buitengebieden_) December 23, 2021
సమాచారం ప్రకారం.. ఈ ఘటన థాయ్‌లాండ్‌లోని ఎలిఫెంట్ నేచర్ పార్క్‌లో చోటుచేసుకుంది. ఏనుగుల ఈ వీడియో చాలా మందిని భావోద్వేగానికి గురి చేస్తోంది. ప్రజలు ఈ వీడియోను తెగ ఇష్టపడుతున్నారు. అందుకే ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. ఈ వీడియో చూస్తే.. ఓ వ్యక్తి తన సన్నిహితుడి నుంచి విడిపోయి చాలా కాలం తర్వాత కలుస్తే ఎలా ఉంటుందో.. అలాంటి సన్నివేశాన్ని చూసినట్లుందని పేర్కొంటున్నారు నెటిజన్లు.
జంతువులు ఎప్పుడూ తమ స్నేహితులను మరచిపోలేవంటూ పేర్కొంటున్నారు. ఈ వీడియో ట్విటర్‌లో Buitengebieden అనే యూజర్ చేశారు. ఇలాంటి దృశ్యాలు మనుషులు, జంతువుల మధ్య ఉండే స్నేహానికి అద్దం పట్టేలా ఉన్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Also Read: