రెచ్చిపోయిన గజరాజులు..17 మందికి గాయాలు.. అసలేమైంది ?

శ్రీలంకలో ఓ మతపరమైన ఊరేగింపు భక్తుల కోలాహలం మధ్య సందడిగా సాగుతోంది. ఈ కార్యక్రమంలో రెండు ఏనుగులను ఘనంగా అలంకరించి నిర్వాహకులు తీసుకువచ్చారు. సాధారణంగా గజరాజులు ఇలాంటి సెలబ్రేషన్స్ లో నిబ్బరంగా పాల్గొంటాయి. మావటీలు ముందుగానే అలా వాటికి శిక్షణ ఇస్తారు. అయితే ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఈ ఏనుగులు ఉన్నట్టుండి.. రెచ్చిపోయి ముందుకు పరుగులు తీశాయి. దీంతో భక్తులంతా భయంతో తలో దిక్కుకూ పారిపోయారు. ఈ తొక్కిసలాటలో కొందరు మహిళలు సహా 17మంది గాయపడ్డారు. […]

రెచ్చిపోయిన గజరాజులు..17 మందికి గాయాలు.. అసలేమైంది ?
Follow us

|

Updated on: Sep 10, 2019 | 3:49 PM

శ్రీలంకలో ఓ మతపరమైన ఊరేగింపు భక్తుల కోలాహలం మధ్య సందడిగా సాగుతోంది. ఈ కార్యక్రమంలో రెండు ఏనుగులను ఘనంగా అలంకరించి నిర్వాహకులు తీసుకువచ్చారు. సాధారణంగా గజరాజులు ఇలాంటి సెలబ్రేషన్స్ లో నిబ్బరంగా పాల్గొంటాయి. మావటీలు ముందుగానే అలా వాటికి శిక్షణ ఇస్తారు. అయితే ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఈ ఏనుగులు ఉన్నట్టుండి.. రెచ్చిపోయి ముందుకు పరుగులు తీశాయి. దీంతో భక్తులంతా భయంతో తలో దిక్కుకూ పారిపోయారు. ఈ తొక్కిసలాటలో కొందరు మహిళలు సహా 17మంది గాయపడ్డారు. పైగా ఓ గజరాజుపై నుంచి మావటీ కింద పడిపోయాడు. అనుకోని ఈ హఠాత్ సంఘటన అందర్నీ నిశ్చేష్టుల్ని చేసింది. కాగా-ఒక్కోసారి ఏనుగులు అత్యంత దూకుడుగా ప్రవర్తిస్తాయని, ఇందుకు వీటి హార్మోన్లు కారణమని జయంత్ జయవర్దనే అనే జంతు నిపుణుడు తెలిపాడు. పండుగలు, పబ్బాలు లేదా ఈ విధమైన మతపరమైన కార్యక్రమాల్లో గజరాజులను వినియోగించే ముందు వాటి ప్రవర్తన ఎలా ఉందో నిశితంగా పరిశీలించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నాడు. బహుశా ఏనుగులు తమ బ్రీడింగ్ సీజన్ లో ఇలా రెచ్చిపోతుంటాయని, ఆ సమయంలో వాటిని అదుపు చేయడం కష్టమవుతుందని ఆయన చెప్పాడు. మావటీలు ముఖ్యంగా మగ గజరాజుల నడవడికపై ప్రధానంగా దృష్టి పెట్టవలసి ఉంటుందని జయవర్ధనే అన్నాడు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ పెద్దగా గాయాలు తగలలేదు. అయితే భక్తులు, ఇతరులు భయంతో వణికిపోయారు.

ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?