AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: గజరాజును చూసి పిల్లిలా పారిపోయిన మృగరాజు.. వీడియో చూసి తెగ ఎంజాయ్‌ చేస్తున్న నెటిజన్లు

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో చుట్టంతా అడవిని తలపిస్తోంది. ఒక చోట సింహం హాయిగా విశ్రాంతి తీసుకుంటుంది. కానీ, పాపం దానికి తెలియదు..

Viral Video: గజరాజును చూసి పిల్లిలా పారిపోయిన మృగరాజు.. వీడియో చూసి తెగ ఎంజాయ్‌ చేస్తున్న నెటిజన్లు
Elephant
Jyothi Gadda
|

Updated on: Sep 20, 2022 | 6:49 PM

Share

Viral Video: ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ప్రతిరోజు లక్షల వీడియోలు అప్‌లోడ్‌ అవుతుంటాయి. ఇక ఇలాంటి వీడియోలు ఎక్కువగా అడవి జంతువులకు సంబంధించినవే ఉంటాయి. ఇక్కడ ఇలాంటి వీడియో ఒకటి చక్కర్లు కొడుతుంది. సాధారణంగా అడవికి రారాజు ఎవరు అంటే సింహం అని చెబుతారు ఎవరైనా. ఒక్కసారి సింహం ఏదైనా జంతువును వేటాడాలని నిర్ణయించుకుంది అంటే చాలు ఇక ఆ జంతువు సింహానికి ఆహారం అయిపోవాల్సిందే. అందుకే ఏ జంతువు కూడా సింహం దరిదాపుల్లోకి వెళ్లడానికి కూడా సాహసం చేయవు. కేవలం చిన్న చిన్న జంతువులనే కాదు పెద్ద పెద్ద దున్నపోతులు జింకలు జిరాఫీలను కూడా సింహాలు వేటాడుతుంటాయి. అయితే, సింహాలు కూడా ఏనుగులను వేటాడటానికి అప్పుడప్పుడూ భయపడాల్సి వస్తుంది. ఇక్కడ ఇలాంటి తరహా వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో చుట్టంతా అడవిని తలపిస్తోంది. ఒక చోట సింహం హాయిగా విశ్రాంతి తీసుకుంటుంది. కానీ, పాపం దానికి తెలియదు..దాని వెనకాల ఏం జరుగుతుందో.. ఎక్కడ్నుంచి వచ్చిందో తెలియదు గానీ, సింహం పడుకున్న చోటుకి ఒక ఏనుగు వచ్చింది.. అది దూరం నుంచి ఆ సింహాన్ని చూసింది..వెంటనే ఆ ఏనుగు వేగం పెంచింది. స్పీడ్‌గా పరిగెత్తుకుంటూ సింహంపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. ఇలా తనవైపు వస్తున్న ఆ భారీ ఏనుగును చూసిన అడవి రాజు..ఒక్క సెకను కూడా లేట్‌ చేయలేదు..రెప్పపాటులో అక్కడ్నుంచి పారిపోయింది. బతుకు జీవుడా అనుకుంటూ ప్రాణభయంతో పరుగులు తీసింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో animalsinthenaturetoday అనే ఖాతా ద్వారా షేర్ చేశారు. రాసే సమయానికి, ఈ వార్తకు వందల కొద్దీ లైక్‌లు, వేల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. యూజర్లు ఏనుగు బలాన్ని కొనియాడుతున్నారు. వీడియో చూసి.. సింహం పారిపోవడాన్ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా