Viral Video: వామ్మో అదేం కొట్టుడు అక్కో.. 20 సెకన్లలో 40 చెప్పు దెబ్బలు కొట్టింది..షాకింగ్‌ వీడియో వైరల్‌

మద్యం మత్తులో ఓ మహిళను వేధించిన తాగుబోతుకు యువతి తగిన శాస్తి చేసింది.. ఇక వీడియో చూసిన ప్రతిఒక్కరూ స్పందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్‌ చేస్తుంది.

Viral Video: వామ్మో అదేం కొట్టుడు అక్కో.. 20 సెకన్లలో 40 చెప్పు దెబ్బలు కొట్టింది..షాకింగ్‌ వీడియో వైరల్‌
Up Woman Thrashes
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 20, 2022 | 4:45 PM

Viral Video: ఒక వ్యక్తి తనను వేధిస్తున్నాడని ఆరోపించిన ఓ మహిళ, 20 సెకన్ల పాటు షూతో 40 సార్లు కొట్టింది. ఈ దృశ్యానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. వేధించేవాడు నేలమీద తల దించుకుని కూర్చున్నాడు. కోపోద్రిక్తురాలైన ఆ మహిళ తన రెండు చెప్పులతో ఎడాపెడ పదేపదే చితక్కొట్టింది. ఈ షాకింగ్‌ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. మద్యం మత్తులో ఓ మహిళను వేధించిన తాగుబోతుకు యువతి తగిన శాస్తి చేసింది..పూర్తి వివరాల్లోకి వెళితే…

ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్‌ జిల్లాలోని ఓరాయి సిటీలో ఓ యువకుడు పీకల దాకా మద్యం సేవించాడు. ఇక ఓ మహిళను లైంగిక వేధింపులకు గురిచేయడంతో..ఆమె అతనికి చుక్కలు చూపించింది. అందరూ చూస్తుండగానే.. తన రెండు చెప్పులతో అతని తలపై నాన్‌ స్టాప్‌గా దంచికొట్టింది. సెకనుకు రెండు దెబ్బల చొప్పున 20 సెకన్లలో 40 సార్లు చెప్పుతో వాయించేసింది.

ఇవి కూడా చదవండి

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మందుబాబును అదుపులోకి తీసుకున్నారు. ఈ వీడియోని ఇప్పటికే 50వేల మందికి పైగా వీక్షించారు. ఇక వీడియో చూసిన ప్రతిఒక్కరూ స్పందించారు. కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్‌ చేస్తుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో