Diwali Cleaning Tips: ఇలా చేయండి.. క్షణాల్లో ఇళ్లు క్లీన్ అవుతుంది.. ఈ చిట్కాలతో సులభంగా క్లీన్ చేసుకోవచ్చు..
పండుగ సీజన్ ప్రారంభం కాకముందే ప్రజలు ఇంటిని శుభ్రం చేయడం మొదలు పెడుతారు. మనం కూడా కొన్ని చిట్కాలతో శ్రమలేకుండా ఇంటిని మెరిసేలా చేసుకోవచ్చు.

దసరా, దీపావళి వచ్చిందంటే చాలు ఇంట్లో చాలా పనులు ఉంటాయి. కొత్త బట్టల కొనుగోలు నుంచి మొదలు ఇంటిని శుశ్రం చేసుకునేవరకు ఎన్నో పనులు చేయాల్సి ఉంటుంది. అయితే ముందుగా ఈ రెండు పండుగలు దేశ వ్యాప్తంగా పెద్ద పండుగలే.. అందులోనై దసరా తర్వాత వచ్చే దీపావళి అంటే మరింత సందడి ఉంటుంది. ఎందుకంటే ధన లక్షి ఇంట్లో రావాలంటే ఇళ్లు అందంగా.. ఆరోగ్యవంతంగా.. శుభ్రంగా ఉంచుకోవాలని ప్రతి గృహిని ఆలోచిస్తుంటారు. అందుకే ముందు నుంచే ఇంటిని శుభ్రం చేయడం మొదలు పెడుతారు. అయితే ఇంటిని శుభ్రపరచడం పెద్ద పని.. ఇలాంటి పని చేయాలంటే మంత్రం తరచుగా ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఎందుకంటే ఇంట్లోని వస్తువులను జరపాలి.. వాటి వెనుక దాగి ఉన్న డస్ట్ మొత్తం క్లీన్ చేయాలి. ఇలాంటి చిక్కు సమస్యలకు.. కొన్ని చిన్ని చిట్కాలతో చెక్ పెట్టొచ్చు. వీటిని అనుసరించడం ద్వారా మీరు ఇంటిని మెరిసేలా చేయవచ్చు. ఇంట్లోని బూజును తొలగించవచ్చు. అది ఎలానో ఓసారి తెలుసుకుందాం..
బ్లీచ్ ఉపయోగించండి..
ఇంటి నుండి సాలీడును శుభ్రం చేయడానికి బ్లీచ్ ఉపయోగించవచ్చు. దీని కోసం, ఒక పెద్ద పాత్రలో సుమారు 1 లీటరు నీటిని తీసుకొని దానికి 1 కప్పు బ్లీచింగ్ పౌండర్‌ను కలపండి. దీని తరువాత, దానిని బాగా కలపండి. స్ప్రే బాటిల్‌లో నింపి స్పైడర్ వెబ్‌పై స్ప్రే చేయండి. తర్వాత పొడి గుడ్డ తీసుకుని ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయాలి. ఇలా చేయడం ద్వారా మీరు సాలీడు గుడ్లను వదిలింవచ్చు, ఇల్లు చాలా కాలం పాటు శుభ్రంగా ఉంటుంది.
వాక్యూమ్ క్లీనర్ సహాయంతో..
స్పైడర్ వెబ్‌ను తొలిగించేందుకు చీపురు లేదా డస్టర్ సహాయం తీసుకుంటారు. దీని కారణంగా అది గోడకు అంటుకుని, ధూళి మీపై కూడా పడుతుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు మీరు వాక్యూమ్ క్లీనర్ ఫర్ క్లీనింగ్ ఉపయోగించవచ్చు.
పెయింట్ రోలర్తో శుభ్రపరచడం..
పైకప్పుపై ఉన్న స్పైడర్ వెబ్‌లను శుభ్రం చేయడానికి మీరు పెయింట్ రోలర్ సహాయం తీసుకోవచ్చు. దీని కోసం పెయింట్ రోలర్ తీసుకొని దాని చుట్టూ డక్ట్ టేప్ చుట్టండి. టేప్ అంటుకునే వైపు బయటికి ఎదురుగా ఉండాలని గుర్తుంచుకోండి. దీని తరువాత, వెబ్‌ను తీసివేయడానికి పైకప్పుపై దాన్ని రోల్ చేయండి. టేప్ మురికిగా మారిన తర్వాత దాన్ని మార్చండి. మరొక వైపు శుభ్రం చేయండి.
ఇంట్లో క్లీనింగ్ స్ప్రే చేయండి..
ఎంత కష్టపడి పనిచేసినా సాలెగూడును సరిగా శుభ్రం చేయక పోవడంతో ఎక్కడో ఒకచోట అతుక్కుపోతాయి. అటువంటి పరిస్థితిలో మీరు వాటిని వదిలించుకోవడానికి ఇంట్లో తయారుచేసిన స్ప్రేని ఉపయోగించవచ్చు. ఇందుకోసం కొబ్బరినూనెలో వైట్ వెనిగర్ మిక్స్ చేసి స్ప్రే బాటిల్‌లో నింపాలి. ఇప్పుడు స్పైడర్ వెబ్‌లపై స్ప్రే చేయండి. ఇది స్పైడర్ వెబ్ చక్కటి, అంటుకునే వైర్లను కూడా తొలిగిస్తుంది. వాటిని శుభ్రం చేయడం చాలా సులభంగా మారుతుంది. దీని తర్వాత మీరు వాటిని వాక్యూమ్ క్లీనర్‌తో శుభ్రం చేయవచ్చు.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం
