Viral: ‘వరుడు కావలెను.. కానీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు అస్సలు ఫోన్ చేయొద్దు’.. నెట్టింట ట్రెండింగ్!
ఈ మధ్యకాలంలో పెద్దలు కుదిర్చే పెళ్లిళ్లు తగ్గిపోయాయి. అంతా మ్యాట్రిమోనియాల్ ట్రెండ్ అయిపోయింది.
ఈ మధ్యకాలంలో పెద్దలు కుదిర్చే పెళ్లిళ్లు తగ్గిపోయాయి. అంతా మ్యాట్రిమోనియాల్ ట్రెండ్ అయిపోయింది. డబ్బులు కట్టి రిజిస్టర్ అయితే చాలు.. వాళ్లే సరైన మ్యాచింగ్ జోడీని వెతికిపెడుతున్నారని భావించేవారు ఎక్కువయ్యారు. ఇదిలా ఉంటే.. ఇటీవల మ్యాట్రిమోనియాల్ సైట్లలోని వివాహ ప్రకటనలు కొంచెం హద్దు దాటుతున్నాయి. అందులో కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తే.. మరికొన్ని నవ్వు తెప్పిస్తున్నాయి. ఆ కోవకు చెందిన ఓ యాడ్ ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
హిందూ పిళ్ళై కుటుంబానికి చెందిన ఓ ధనవంతురాలైన యువతికి వరుడు కావలెను.. సారీ.. సారీ.. అదే కులానికి చెందిన వరుడు కావలెను. ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్, బిజినెస్‌మాన్.. ఇలా ఎవ్వరైనా పర్లేదు అని ప్రకటనలో పేర్కొన్నారు. అయితే చివర్లో మాత్రం ‘సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు అస్సలు ఫోన్ చేయొద్దు’ అని స్పష్టం చేశారు. ఇప్పుడు అదే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. కాగా, ఈ యాడ్‌ను సమీర్ అరోరా అనే నెటిజన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా.. నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ ఓ లుక్కేయండి.
Future of IT does not look so sound. pic.twitter.com/YwCsiMbGq2
— Samir Arora (@Iamsamirarora) September 16, 2022