Viral Video: షాప్ లో ఆహారం దొంగలించి పారిపోయిన బాతు.. హృదయాన్ని కదిలించే సన్నివేశం…
సృష్టిలో అపురమైంది అమ్మ ప్రేమ.. తన పిల్లల కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయని గుణం అమ్మ సొంతం. అమ్మదనం గురించి ఎంత చెప్పినా తక్కువే.. అది మనుశుల్లోనైనా.. పశుపక్షాదుల్లోనైనా.. అమ్మ ప్రేమని తెలియజేసే అనేక వీడియోలు తరచుగా వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఒక బాతు వీడియో వైరల్ అవుతోంది. అందులో ఒక బాతు దుకాణం నుంచి ఆహారం దొంగలించి తీసుకుని వెళ్తుంది. అది చూసి షాప్ ఓనర్ దానిని వెంబడించాడు. తర్వాత సన్నివేశం అతడిని మతమే కాదు చూపరులను భావోద్వేగానికి గురి చేస్తుంది

అమ్మప్రేమని తెలియజేసే మరొక వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయింది. ఈ వీడియో ప్రతి ఒక్కరినీ నచ్చడంతో తెగ షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు. ఇదేగా అమ్మ ప్రేమంటే అంటున్నారు. ఒక బాతు బేకరీలోకి ప్రవేశించి, దాని ముక్కుతో ఆహార పదార్థాలను పట్టుకుని తీసుకుని పారిపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాతు ఆహారాన్ని తీసుకెళ్తున్న దృశ్యాన్ని చూసిన దుకాణదారుడు దానిని వెంబడించడం ప్రారంభించాడు. దానిని పట్టుకోండి అంటూ సహచరులకు కూడా ఆదేశాలు ఇచ్చాడు. అయితే చివరి సన్నివేశం అతన్ని భావోద్వేగానికి గురి చేసింది.
మనం తరచుగా జంతువులు, పక్షుల వీడియోలను సోషల్ మీడియాలో చూస్తుంటాము. అయితే వాటిల్లో కొన్ని మనల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. అంతేకాదు అమ్మ ప్రేమని, తన పిల్లల కోసం అవి ప్రాణాలకు తెగించి చేసే పోరాటాలకు సంబంధించిన వీడియోలు తారచుగా వైరల్ అవుతాయి. పక్షులు, జంతువులకు సంబంధించిన కొన్ని చర్యలు చాలా అందంగా ఉంటాయి. అవి మన ముఖాల్లో చిరునవ్వును తెస్తాయి. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఇది హృదయాన్ని హత్తుకునేలా ఉంది. వీడియోలో, ఒక బాతు అకస్మాత్తుగా బేకరీలోకి ప్రవేశించి.. తన ముక్కుతో అక్కడ ఉన్న ఆహారాన్ని తీసుకుని పారిపోవడం ప్రారంభిస్తుంది. చివరికి జరుగుతుంది చూస్తే మిమ్మల్ని రంజింపజేస్తుంది.
పిల్లలకు ఆహారం పెట్టడం అంత సులభం కాదు
వైరల్ అవుతున్న వీడియోలో ఒక బేకరీలో ఒక బాతు అకస్మాత్తుగా లోపలి వేల్ల్డింది. తనకు అందిన చోట ఉన్న ఒక ఆహారాన్ని ముక్కుతో గట్టిగా పట్టుకుంది.. తర్వాత దానిని తీసుకుని బయటకు వెళ్ళే సమయంలో దుకాణంలో అడ్డు వచ్చిన వాటిని దాటుకుంటూ.. బయటకు చేరుకుంది. ఇలా బాతు ఆహారం తీసుకుని వెళ్ళడం దుకాణదారుడు చూసి ఆశ్చర్యపోయి దాని వెంట పరుగెత్తాడు. అయితే బాతు బయటికి చేరుకోగానే అక్కడ చూసిన దృశ్యం అతడిని ఆకట్టుకుంది. ఎందుకంటే ఆ బాతు ఆకలితో ఉన్న తన పిల్లల ఆకలి తీర్చడానికి ఆహారాన్ని తీసుకువెళ్ళింది. బయటకు వెళ్ళిన వెంటనే తన ముక్కులో ఉన్న ఆహారాన్ని పిల్లల మధ్య విడిచి పెట్టింది. అప్పుడు బాతుపిల్లలు సంతోషంగా దానిని తినడం ప్రారంభించారు. ఈ వీడియో చూసిన తర్వాత ప్రజలు చాలా భావోద్వేగానికి గురయ్యారు.
వైరల్ వీడియో చూడండి ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో @cloud అనే ఖాతా ద్వారా షేర్ చేయబడింది. ఇప్పటికే 1.4 మిలియన్లకు పైగా ప్రజలు ఈ వీడియోను చూశారు. ఇదేగా అమ్మ ప్రేమ అంటూ రకరకాల కామెంట్స్ చెస్తూ తల్లి ప్రేమ గొప్పదనాన్ని చెబుతున్నారు.
Ducks 🤦♂️
Oh wait. All good 😊 pic.twitter.com/t2cibSnPk5
— Cloud (@cloud1a7) October 4, 2025
మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




