పాకిస్తాన్‌లో ఇంటర్నెట్‌కు ఇంత రేటు పెట్టాలా.? 5జీబీ డేటా ప్యాక్ ఎంతో తెలిస్తే.!

మన శత్రుదేశం పాకిస్తాన్.. ఉగ్రవాదానికి మారుపేరు అయిన పాకిస్తాన్‌లో టెక్నాలజీ స్థితిగతులు ఏంటి.? అక్కడ డేటా ప్లాన్స్ ఎలా ఉంటాయి.? ఇంటర్నెట్ చౌకైనదా.? లేక ఖరీదైనదా.? మన దేశంలో ఇంటర్నెట్ ప్లాన్ ధరతో పోలిస్తే ఎంత ఉంటుంది.? లాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందామా.. మన దేశంలో ఇంటర్నెట్ వినియోగం..

పాకిస్తాన్‌లో ఇంటర్నెట్‌కు ఇంత రేటు పెట్టాలా.? 5జీబీ డేటా ప్యాక్ ఎంతో తెలిస్తే.!
Follow us
Ravi Kiran

|

Updated on: May 11, 2024 | 5:31 PM

మన శత్రుదేశం పాకిస్తాన్.. ఉగ్రవాదానికి మారుపేరు అయిన పాకిస్తాన్‌లో టెక్నాలజీ స్థితిగతులు ఏంటి.? అక్కడ డేటా ప్లాన్స్ ఎలా ఉంటాయి.? ఇంటర్నెట్ చౌకైనదా.? లేక ఖరీదైనదా.? మన దేశంలో ఇంటర్నెట్ ప్లాన్ ధరతో పోలిస్తే ఎంత ఉంటుంది.? లాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందామా.. మన దేశంలో ఇంటర్నెట్ వినియోగం పెరిగినప్పటి నుంచి చాలామంది తమకిష్టమైన వాటిని ఇంటి దగ్గర నుంచే మొబైల్ ద్వారా ఆర్డర్ పెట్టేస్తున్నారు. ఫుడ్ నుంచి ఫర్నిచర్ వరకు.. ల్యాప్‌టాప్స్ నుంచి మొబైల్ చార్జర్స్ వరకు అన్ని ఇంటికే జస్ట్ వన్ క్లిక్‌తో పొందుతున్నారు. దేశంలో ఓ యూజర్ నెలకు 12 జీబీ ఇంటర్నెట్ ఉపయోగిస్తాడనడంలో అతిశయోక్తి లేదు. దీనితో ఇండియాలోని సర్వీస్ ప్రొవైడర్స్ జనాలను ఆకట్టుకునేందుకు తక్కువ ధరలకే ఇంటర్నెట్ ప్లాన్స్ అందిస్తున్నాయి. భారత్‌లో 100 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ ప్లాన్ సుమారు రూ. 800కు అందుబాటులో ఉండగా.. పాకిస్థాన్‌లో ఇదే ప్లాన్‌కు రూ. 1550 చెల్లించాల్సి ఉంటుంది. అక్కడ ఇంటర్నెట్ చాలా కాస్ట్లీ.

అక్కడ ఓ టెలికాం కంపెనీ అందుబాటులోకి తీసుకొచ్చిన ప్లాన్స్ ఒక్కసారి చెక్ చేస్తే.. 12GB ఇంటర్నెట్, 350 మినిట్స్ కాలింగ్ ప్యాక్ 950 పాకిస్తానీ రూపాయలు కాగా.. ఈ ప్లాన్ నెల వ్యాలిడిటీతో దొరుకుతోంది. ఇక 1500 పాకిస్తాన్ రూపాయల వీక్లీ ప్లాన్‌లో 40 GB ఇంటర్నెట్, 600 మినిట్స్ కాలింగ్ అందుబాటులో ఉంది. అలాగే ఓన్లీ ఇంటర్నెట్ ప్లాన్స్ ఒక్కసారి పరిశీలిస్తే.. 100 GB ఇంటర్నెట్‌ 250 పాకిస్తానీ రూపాయలు.

ఇది చదవండి: ఇంటికి రిపేర్ చేస్తుండగా కార్పెట్ కింద ఏదో ఉందని అనుమానం.. ఏంటా అని చూడగా.!

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..