Viral: ఇంటికి రిపేర్ చేస్తుండగా కార్పెట్ కింద ఏదో ఉందని అనుమానం.. ఏంటా అని చూడగా.!
పురాతన మహల్స్, భవంతుల్లో లెక్కపెట్టలేని ఎన్నో గదులు ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఇలాంటి ఇళ్లల్లో మనకే తెలియని ఎన్నో సీక్రెట్స్ దాగి ఉంటాయి. ఒక్కోసారి అవి బయటపడ్డ తర్వాత మనం నోరెళ్లబెట్టాల్సిందే. సరిగ్గా ఇద్దరు యువకులకు ఇదే అనుభవం జరిగింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వార్త ఇంటర్నెట్‌లో..
పురాతన మహల్స్, భవంతుల్లో లెక్కపెట్టలేని ఎన్నో గదులు ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఇలాంటి ఇళ్లల్లో మనకే తెలియని ఎన్నో సీక్రెట్స్ దాగి ఉంటాయి. ఒక్కోసారి అవి బయటపడ్డ తర్వాత మనం నోరెళ్లబెట్టాల్సిందే. సరిగ్గా ఇద్దరు యువకులకు ఇదే అనుభవం జరిగింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వార్త ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ వివరాలు ఏంటంటే.? వివరాల్లోకెళ్తే.. అమెరికాకు చెందిన ఇద్దరు వ్యక్తులు.. స్థానికంగా ఓ ఇంట్లో నివాసముంటున్నారు. ఆ ఇంట్లో రెండు కన్నా ఎక్కువ బెడ్‌రూమ్స్ ఉన్నాయి. కొద్దిరోజులు బాగానే ఉంది. కానీ ఆ తర్వాతే.. ఒక బెడ్ రూమ్ నుంచి అంతుబట్టని వాసన ఏదో రావడం మొదలైంది. వారికేం అర్ధం కాలేదు.
ఈ విషయంపై ఇద్దరి మధ్య గొడవ కూడా జరిగింది. దీంతో ఓ రోజు వారిద్దరూ ఇంటికి రిపేర్ చేయించాలని పూనుకున్నారు. ఇక అప్పుడు అసలు విషయం బయటపడింది. రిపేర్ చేస్తుండగా ఓ బెడ్‌రూమ్‌లోని కార్పెట్ కింద అనూహ్యంగా కనిపించిన దృశ్యానికి సదరు వ్యక్తులు షాక్ అయ్యారు. కార్పెట్ కింద ఏకంగా మ్యాన్‌హోల్ ఉండటంతో ఆశ్చర్యపోయారు. దానిపైన ఉన్న తుప్పుపట్టిన ఇనుప మూత తీయగా.. మురుగునీరు పోయే పైపు కనిపించింది. దీంతో అతడు నిర్ఘాంతపోయాడు.
ఇది చదవండి: దమ్మున్న పజిల్.! మీ వైపే చూస్తోన్న చిరుతను కనిపెట్టగలరా.? గుర్తిస్తే మీరే తోపు.
కాగా, ఈ అంశాన్ని అతడు నెటిజన్లతో సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఇంతకీ ఆ మ్యాన్‌హోల్ అక్కడ ఎందుకు ఏర్పాటు చేశారు.? ఇంటి బయట ఉండాల్సింది.. ఇంటి లోపల ఎలా ఉంది.? అనే ప్రశ్నలు వారికి అంతుచిక్కడం లేదు. కాగా, ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..