Viral Video: ఏ మాత్రం సందేహం లేకుండా.. ఈ ఫోటోలో ఉంది పుచ్చకాయ అనుకుంటున్నారు కదూ! అయితే మీరు పొరబడినట్లే..
Viral Video: అందరూ చేసే పనిని మనం చేస్తే కిక్కు ఏముంటుంది చెప్పండి.. మనిషి అన్నాక కాస్త కళా పోషణ ఉండాలి అని చెబుతుంటారు. మరీ ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్న వారు ఏదో ఒకటి...

Viral Video: అందరూ చేసే పనిని మనం చేస్తే కిక్కు ఏముంటుంది చెప్పండి.. మనిషి అన్నాక కాస్త కళా పోషణ ఉండాలి అని చెబుతుంటారు. మరీ ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్న వారు ఏదో ఒకటి కొత్తగా ఆలోచించాలి. అందరూ అదే వస్తువులను అమ్ముతారు.. మరీ వినియోగదారుడు మీ దగ్గరే ఎందుకు కొనుగోలు చేయాలి. అందుకే రకరకాల ఎత్తుగడలతో వినియోగదారులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంటారు. ఇందులో భాగంగా కొందరు మంచి మంచి ఆఫర్లను ప్రకటిస్తే.. మరి కొందరు వస్తువుల తయారీలో వనూత్నతను ప్రదర్శిస్తుంటారు. తాజాగా నెట్టింట వైరల్ అవుతోన్న ఓ వీడియోనే దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పవచ్చు.
ఇంతకీ విషయమేంటంటే.. కేకులు అంటే అందరికీ ఇష్టమే. అయితే ఎక్కడైనా కామన్‌గా లభించే ఈ కేకులకు ఓ ప్రత్యేకతను తీసుకురావాలని భావించారు ఓ ఔత్సాహిక మహిళా వ్యాపార వేత్త. ఇందులో భాగంగానే రకరకాల ఆకారాల్లో కేకులను తయారు చేసి అమ్మడం ప్రారంభించారు. అయితే కేవలం అమ్మడమే కాకుండా ఆ కేకులను వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తున్నారు. సైడ్‌సెర్ఫ్ కేక్స్ అనే పేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ కేక్‌లను తాను ఎలా తయారు చేస్తుందో కూడా వివరిస్తూ తీసిన వీడియోలను యూట్యూబ్‌లో కూడా పోస్ట్ చేస్తున్నారు.
ఇక ఈ కేక్‌లను చూస్తే మీ కళ్లను మీరే నమ్మలేరు. అసలు చూస్తోంది కేకా.. నిజమైన వస్తువుతా అన్న భావన కలుగుతుంది. పుచ్చకాయను, షూ, యాపిల్, నిమ్మకాయ, బర్గర్, బొమ్మలు, కూరగాయలు, పండ్లు, కుక్కపిల్ల.. ఇలా చెప్పుకుంటే ప్రతీ ఆకారాన్ని కేకు రూపంలోకి మార్చేశారు. మరి అద్భుతమైన కొన్ని కేక్ వీడియోలపై మీరూ ఓ లుక్కేయండి..
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
Also Read: AP Politics: నేను, భువనేశ్వరి నైతిక విలువలతో పెరిగాం.. ఆ వ్యాఖ్యలు బాధ కలిగించాయి.. పురంధేశ్వరి
Delhi Pollution: 60 వేల కోట్లకు ఎసరుపెట్టిన ఢిల్లీ కాలుష్యం.. వివరాలు తెలిస్తే షాక్ అవుతారు..
Weight Loss: బరువు తగ్గాలనుకునేవారు ఈ లెక్కలు తెలుసుకోండి.. అప్పుడే మీ కేలరీలను కరిగించవచ్చు..