Video: దీపావళికి ఇవా ఇచ్చేది..? ఛల్ మాకొద్దు పో..! కంపెనీ గేట్ ముందు సోన్‌పాపిడీ బాక్స్‌ల కుప్ప..
దీపావళి పండుగకు కంపెనీలు ఇచ్చే గిఫ్ట్స్‌పై ఉద్యోగుల అసంతృప్తి వ్యక్తమైంది. పదేపదే సోన్‌పాపిడీ ఇవ్వడంపై విసుగెత్తిన ఓ కంపెనీ ఉద్యోగులు, వాటిని కంపెనీ గేటు ముందు కుప్పగా పోశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పండగల్లో దీపావళి పండగ చాలా స్పెషల్. కులమతాలతో సంబంధం లేకుండా అందరూ టపాసులు పేల్చుతూ చిన్నా పెద్దా సంతోషంగా గడుపుతుంటారు. ఇంత స్పెషల్ పండగ కావడంతో దాదాపు అన్ని కంపెనీలు కూడా ఈ శుభ సంతోషంలో తమ సంస్థ ఎదుగుదలకు పాటుపడుతున్న ఉద్యోగులకు స్పెషల్ గిఫ్ట్స్ ఇస్తుంటాయి. ఎక్కువగా స్వీట్ బాక్సులు ఇస్తుంటారు.
అయితే కొన్ని కంపెనీలు మాత్రం ప్రతీసారి ఓ పావుకిలో సోన్‌పాపిడీ డబ్బా ఇచ్చి చేతులు దులుపుకుంటూ ఉంటారు. ఉద్యోగులు కూడా అయిష్టంగానే వాటిని తీసుకుంటారు. అయితే ఈసారి ఓ కంపెనీ ఉద్యోగులు మాత్రం తమ అసహనాన్ని బహిరంగంగా వ్యక్తం చేశారు. దీపావళి గిఫ్ట్‌గా కంపెనీ ఇచ్చిన సోన్‌పాపిడీ బాక్సులను కంపెనీ గేటు ముందు కుప్పగా పోశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Video: “Not so sweet Diwali” Video from a factory in Haryana’s Sonipat industrial belt shows workers tossing SOAN PAPDI gift boxes in anger. The clip’s gone viral online.#Diwali2025 #SoanPapdi #ViralVideo #FactoryLife #IndiaNews pic.twitter.com/En7RoaXzlO
— Kushagra Mishra (@m_kushagra) October 21, 2025
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
