AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీకు తెలుసా? బట్టలపై ఉండే S, M, L సైజుల వెనుక ఇంత పెద్ద చరిత్ర ఉందని..!

మనం షాపింగ్ మాల్‌కు వెళ్లినా లేదా ఆన్‌లైన్‌లో దుస్తులు ఆర్డర్ చేసినా, మొదట చూసేది సైజ్ ట్యాగ్. మన శరీరానికి సరిపోయే S (స్మాల్), M (మీడియం), L (లార్జ్) సైజులను క్షణాల్లో ఎంపిక చేసుకుంటాం. కానీ, ఈ సైజుల వ్యవస్థ ఎప్పుడు, ఎలా ప్రారంభమైందో మీకు తెలుసా? దీని వెనుక దాదాపు 200 ఏళ్ల నాటి ఆసక్తికరమైన చరిత్ర దాగి ఉందని తెలిస్తే ఆశ్చర్యపోతారు.

మీకు తెలుసా? బట్టలపై ఉండే S, M, L సైజుల వెనుక ఇంత పెద్ద చరిత్ర ఉందని..!
Clothing Size History
Jyothi Gadda
|

Updated on: Jun 16, 2026 | 3:22 PM

Share

ఈ రోజుల్లో మనం షాపింగ్ మాల్‌లో గానీ, ఆన్‌లైన్‌లో గానీ బట్టలు కొన్నప్పుడు, ముందుగా సైజు చూసుకొని మన సైజును కనుక్కుంటాము. కానీ, ఈ సైజింగ్ పద్ధతి లేనప్పుడు ప్రజలు బట్టలు ఎలా కొనేవారో అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? సుమారు 200 సంవత్సరాల క్రితం వరకు, రెడీమేడ్ బట్టలు అనేవి ఉండేవి కావు. ఆ రోజుల్లో ఎవరికైనా బట్టలు అవసరమైతే, కేవలం రెండు మార్గాలు మాత్రమే ఉండేవి. ధనవంతులు నేరుగా దర్జీ దగ్గరకు వెళ్ళేవారు. దర్జీ వారి శరీర కొలతలను అంగుళం అంగుళం తీసుకుని, వారికి సరిగ్గా సరిపోయే బట్టలను కుట్టేవాడు.

200 ఏళ్ల క్రితం పరిస్థితి ఏమిటి?:

అంతగా ధనవంతులు కాని వారి ఇళ్లలో, మహిళలు తమ బట్టలను తామే కుట్టుకునేవారు. చిన్న పిల్లల కోసం పాత జీన్స్ లేదా వదులుగా ఉండే దుస్తులను కత్తిరించి ఆ పిల్లలకు కావాల్సిన సైజులో కుట్టేవారు. దీని అర్థం ఏమిటంటే, ఆ బట్టలు ధనవంతులవైనా, పేదవారివైనా, అవి వారి వారి శరీరానికి సరిపోయేలా కుట్టబడేవి. ఆ రోజుల్లో సైజులు అనే పద్ధతి ఉండేది కాదు. అది కేవలం శరీరానికి సరిపోయేలా కుట్టేవారు. మరీ మన దుస్తులపై S, M, L సైజుల విధానం ఎప్పుడు ప్రారంభమైంది..? గతంలో ప్రజలు దుస్తులను ఎలా కొనుగోలు చేసేవారు? సుమారు 200 సంవత్సరాల క్రితం వరకు రెడీమేడ్ దుస్తులు అనే పదం లేదని మీకు తెలుసా? 1800లలో ప్రారంభమైన దుస్తుల సైజింగ్ విధానం గురించి తెలుసుకోండి.

యుద్ధ రంగంలో పుట్టిన సైజుల విధానం:

ఈ S, M, L సైజుల విధానం ఏ ఫ్యాషన్ షోల నుంచో లేదా పెద్ద బ్రాండ్ల నుంచో రాలేదు. ఇది యుద్ధ రంగం నుండి పుట్టింది. 1800ల కాలంలో నెపోలియన్ యుద్ధాలు, అమెరికన్ అంతర్యుద్ధం (Civil War) వంటి భారీ యుద్ధాలు జరుగుతున్నప్పుడు, ప్రభుత్వాలకు ఒక పెద్ద సమస్య ఎదురైంది. లక్షలాది మంది సైనికులకు ఒకే రకమైన యూనిఫారాలను తక్కువ సమయంలో ఎలా అందించాలనేదే ఆ సమస్య. ప్రతి సైనికుడిని దర్జీ వద్దకు పంపి కొలతలు తీయించడం సాధ్యం కాలేదు. దీనికి పరిష్కారంగా, దుస్తుల తయారీదారులు వేలాది మంది సైనికుల శరీర కొలతలను సేకరించారు. పురుషుల ఛాతీ (Chest) వెడల్పులో ఒక నిర్దిష్టమైన ప్యాటర్న్ లేదా సగటు కొలత ఉన్నట్లు వారు గమనించారు. దీని ఆధారంగానే పురుషుల యూనిఫారాల కోసం మొదటిసారిగా స్మాల్, మీడియం, లార్జ్ అనే ప్రామాణిక (Standard) సైజులను వర్గీకరించారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో రెడీమేడ్ దుస్తుల రంగానికి బలమైన పునాది పడింది.

ఇవి కూడా చదవండి

మహిళల సైజుల గుర్తింపు, ఆధునిక రూపం:

పురుషుల సైజులు విజయవంతమయ్యాక, 1939లో అమెరికా ప్రభుత్వం మహిళల దుస్తుల కోసం ఒక భారీ సర్వేను నిర్వహించింది. ఈ పరిశోధనలో దాదాపు 15,000 మంది మహిళల శరీరాల్లోని 59 విభిన్న భాగాల కొలతలను తీసుకున్నారు. ఈ డేటా ఆధారంగానే నేడు మనం చూస్తున్న S, M, L, XL వంటి ప్రామాణిక సైజ్ చార్ట్ రూపొందింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఫ్యాక్టరీలలో దుస్తుల ఉత్పత్తి వేగవంతం కావడంతో, ఈ సైజ్ సిస్టమ్‌ను ప్రపంచవ్యాప్తంగా అందరూ అంగీకరించి అమలులోకి తెచ్చారు. దుస్తుల కొనుగోలును సులభతరం చేసిన ఈ విధానం నిజంగా యుద్ధం తెచ్చిన ఒక విప్లవాత్మక మార్పు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us