AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొత్త మార్పులతో మార్కెట్‌కి షాక్‌ ఇస్తున్న హోండా ఎస్‌యూవీ.. ఎలివేట్​ ఫేస్‌లిఫ్ట్‌లో కనిపించిన మార్పులివే

మిడ్‌సైజ్ SUV విభాగంలో Honda Elevateకు మంచి గుర్తింపు ఉంది. ఇప్పుడు ఈ SUV మరింత కొత్త లుక్‌తో ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. Honda Elevate Faceliftలో కొత్త గ్రిల్, LED లైటింగ్, టెయిల్ ల్యాంప్స్‌తో పాటు ఇంటీరియర్‌లోనూ మార్పులు కనిపించనున్నాయి. అక్టోబర్ 6న లాంచ్ కానున్న ఈ మోడల్ కోసం ఇప్పటికే బుకింగ్స్ మొదలయ్యాయి. దీంతో SUV ప్రియుల్లో ఆసక్తి పెరుగుతోంది.

కొత్త మార్పులతో మార్కెట్‌కి షాక్‌ ఇస్తున్న హోండా ఎస్‌యూవీ.. ఎలివేట్​ ఫేస్‌లిఫ్ట్‌లో కనిపించిన మార్పులివే
Honda Elevate Facelift
Nikhil
|

Updated on: Oct 05, 2026 | 8:50 PM

Share

Honda Elevate మిడ్‌సైజ్ SUV త్వరలో కొత్త రూపంలో భారత మార్కెట్లోకి రాబోతోంది. Honda Elevate Facelift మోడల్‌ను అక్టోబర్ 6న విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇప్పటికే ప్రీ-బుకింగ్స్ ప్రారంభం కాగా, డీలర్‌షిప్‌లలో రూ.21,000 టోకెన్ అమౌంట్‌తో బుక్ చేసుకునే అవకాశం ఉంది. లాంచ్‌కు ముందు విడుదలైన టీజర్‌లో కొత్త SUV ముందు, వెనుక డిజైన్‌తో పాటు క్యాబిన్‌లో చేయబోయే మార్పులపై కొన్ని ఆసక్తికరమైన వివరాలు కనిపించాయి. దీంతో కొత్త Elevateపై అంచనాలు పెరిగాయి.

కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్

ఫేస్‌లిఫ్ట్‌లో ముందు భాగానికి కొత్త హెక్సాగోనల్ గ్రిల్ డిజైన్ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గ్రిల్‌పై ఉన్న Honda లోగోను బోనెట్‌పైకి మార్చే అవకాశం ఉంది. కొత్త సెగ్మెంటెడ్ LED DRLలు Honda City ఫేస్‌లిఫ్ట్‌ను పోలి కనిపిస్తున్నాయి. వెనుక భాగంలో కనెక్టెడ్ LED టెయిల్ ల్యాంప్స్ ప్రధాన మార్పుగా నిలవనున్నాయి. ORVMపై కనిపించిన కెమెరా పాడ్ ద్వారా LaneWatch కెమెరా కొనసాగనున్నట్లు తెలుస్తోంది. అయితే 360 డిగ్రీ కెమెరా వస్తుందా అనే అంశంపై స్పష్టత లేదు.

క్యాబిన్‌లో ప్రీమియం టచ్..

ఇంటీరియర్‌లో తెల్లటి లెదరెట్ ప్యాడింగ్, కొత్త స్టిచింగ్, అంబర్ యాంబియంట్ లైటింగ్ కనిపిస్తున్నాయి. పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పవర్డ్ కో-డ్రైవర్ సీటు వంటి ఫీచర్లు వచ్చే అవకాశం ఉంది. ఇంజిన్‌లో మాత్రం పెద్ద మార్పు ఉండకపోవచ్చు. ప్రస్తుత 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 121hp పవర్, 145Nm టార్క్ అందిస్తుంది. ప్రస్తుతం Elevate ధర రూ.11.81 లక్షల నుంచి రూ.16.36 లక్షల ఎక్స్-షోరూమ్ వరకు ఉంది. ఫేస్‌లిఫ్ట్ ధరపై లాంచ్ సమయంలో స్పష్టత రానుంది.

Follow Us
రూ. 4 లక్షల బడ్జెట్‌లో బెస్ట్ కారు కావాలా? మైలేజ్‌లో రికార్డు
రూ. 4 లక్షల బడ్జెట్‌లో బెస్ట్ కారు కావాలా? మైలేజ్‌లో రికార్డు
కొత్త హోండా ఎలివేట్‌లో కనిపించిన మార్పులివే
కొత్త హోండా ఎలివేట్‌లో కనిపించిన మార్పులివే
స్టిండీస్‌తో తొలి టీ20.. అభిషేక్ శర్మ ముందు 3 కీలక మైలురాళ్లు..!
స్టిండీస్‌తో తొలి టీ20.. అభిషేక్ శర్మ ముందు 3 కీలక మైలురాళ్లు..!
Satellite Internet: వైర్లు లేకుండా నింగి నుంచే నెట్!
Satellite Internet: వైర్లు లేకుండా నింగి నుంచే నెట్!
టైల్స్, మార్బుల్, గ్రానైట్.. ఇంటి ఫ్లోరింగ్‌కు ఏది బెస్ట్..?
టైల్స్, మార్బుల్, గ్రానైట్.. ఇంటి ఫ్లోరింగ్‌కు ఏది బెస్ట్..?
శ్రీవారిని దర్శించుకున్న ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్..
శ్రీవారిని దర్శించుకున్న ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్..
సింగీతం శ్రీనివాసరావు ఫ్యామిలీని చూశారా? వారసులు ఏం చేస్తున్నారంట
సింగీతం శ్రీనివాసరావు ఫ్యామిలీని చూశారా? వారసులు ఏం చేస్తున్నారంట
వర్షాకాలం పోయినా తగ్గని వేడి.. అక్టోబర్ హీట్‌పై షాకింగ్ అలర్ట్!
వర్షాకాలం పోయినా తగ్గని వేడి.. అక్టోబర్ హీట్‌పై షాకింగ్ అలర్ట్!
ఈ కాంబో సెట్‌ కొన్నారంటే కిచెన్‌లో పనులన్నీ ఈజీగా అయిపోతాయ్
ఈ కాంబో సెట్‌ కొన్నారంటే కిచెన్‌లో పనులన్నీ ఈజీగా అయిపోతాయ్
చంద్రుడి పై అణుశక్తి పోటీ.. అమెరికాకు చైనా, రష్యా సవాల్
చంద్రుడి పై అణుశక్తి పోటీ.. అమెరికాకు చైనా, రష్యా సవాల్