AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: బాల్కనీ నుంచి జారిపడిన బాలుడు.. క్షణాల్లో కాపాడిన యువకుడు

కళ్ల ముందే బాలుడు కిందికు జారిపడుతున్నాడు.. ఏం చేయాలో ఆలోచించే సమయం కూడా లేదు. క్షణాల్లో పరుగెత్తుకొచ్చిన ఓ యువకుడు బాలుడిని పట్టుకున్నాడు. రెండో అంతస్తు బాల్కనీ నుంచి కిందపడుతున్న ఐదేళ్ల బాలుడిని అహ్మద్ రగబ్ చాకచక్యంగా పట్టుకుని ప్రాణాలు కాపాడాడు. ఈజిప్టులోని గిజాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Video: బాల్కనీ నుంచి జారిపడిన బాలుడు.. క్షణాల్లో కాపాడిన యువకుడు
Egyptian Man Saves Boy Falling From Balcony
Sharada V
|

Updated on: Oct 05, 2026 | 7:24 PM

Share

గిజాలోని అర్డ్ ఎల్-లెవా ప్రాంతంలో ఓ దుకాణం సమీపంలో అహ్మద్ రగబ్ నిల్చొని ఉన్నాడు. ఆ సమయంలో ఓ భవనం వైపు నుంచి అరుపులు, ఏడుపు వినిపించాయి. ఏం జరిగిందో అటువైపు చూశాడు. అంతలోనే రెండో అంతస్తు నుంచి ఓ చిన్నారి కిందకు పడిపోవడం కనిపించింది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా రగబ్ బాలుడి వైపు పరుగెత్తాడు. అతడు కింద పడే ప్రదేశాన్ని అంచనా వేసి.. బాలుడిని పట్టుకునేందుకు సరైన చోట నిలబడ్డాడు.

వాషింగ్ లైన్‌.. బాలుడికి దొరికిన అదనపు క్షణం

బాలుడు కింద పడుతున్న సమయంలో మధ్యలో ఓ వాషింగ్ లైన్‌కు ఢీకొన్నాడు. దీంతో అతడి వేగం కాస్త తగ్గింది. అదే సమయంలో రగబ్‌కు బాలుడి దగ్గరకు చేరుకునేందుకు కొన్ని కీలక క్షణాలు లభించాయి. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న రగబ్.. బాలుడు నేలను నేరుగా ఢీకొట్టకుండా తన చేతుల్లో పట్టుకున్నాడు. వెంటనే చుట్టుపక్కల జనం అక్కడికి చేరుకున్నారు. ఘటనపై రగబ్ మాట్లాడుతూ అంతా వేగంగా జరిగిపోయిందనీ, తన భద్రత గురించి ఆలోచించే అవకాశం లేదని తెలిపాడు. బాలుడు ప్రమాదంలో ఉన్నాడని కనిపించగానే కాపాడేందుకు పరుగెత్తాననీ, బాలుడు సురక్షితంగా ఉన్న తర్వాతే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో తనకు అర్థమైందని వివరించాడు. అసలు తాను బాలుడిని అంత వేగంగా ఎలా చేరుకోగలిగానో కూడా తనకు సరిగ్గా తెలియదని రగబ్ చెప్పాడు. ఇలాంటి పరిస్థితి మళ్లీ ఎదురైతే అదే విధంగా చేయగలనో లేదో కూడా చెప్పలేనని అన్నాడు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది. బాలుడిని కాపాడిన రగబ్ సమయస్ఫూర్తిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ ఘటన తర్వాత రగబ్ తల్లిదండ్రులకు ఓ ముఖ్యమైన సూచన చేశాడు. చిన్నపిల్లలను బాల్కనీలు, కిటికీల దగ్గర ఒంటరిగా వదిలిపెట్టవద్దని కోరాడు. పిల్లలు ఎక్కేందుకు అవకాశం ఉండే కుర్చీలు, టేబుళ్లు లేదా ఇతర వస్తువులను బాల్కనీ, కిటికీలకు దగ్గరగా ఉంచకూడదని సూచించాడు. ఒక్క క్షణం.. ఓ చిన్నారి ప్రాణాన్ని కాపాడింది. ప్రమాదాన్ని చూసి వెనుకడుగు వేయకుండా వెంటనే స్పందించిన రగబ్ సమయస్ఫూర్తి ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది

Follow Us
దీపావళికి బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? చౌకైన 5 బైక్‌లు ఇవే!
దీపావళికి బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? చౌకైన 5 బైక్‌లు ఇవే!
Video: బాల్కనీ నుంచి జారిపడిన బాలుడు.. క్షణాల్లో కాపాడిన యువకుడు
Video: బాల్కనీ నుంచి జారిపడిన బాలుడు.. క్షణాల్లో కాపాడిన యువకుడు
'రామాయణ’ సెట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. అసలేం జరిగిందంటే?
'రామాయణ’ సెట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. అసలేం జరిగిందంటే?
హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సామ్ కోషి
హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సామ్ కోషి
'అమ్మాయిగా మారి పదేళ్లు'.. బిగ్‌బాస్ ప్రియాంక ఎమోషనల్ పోస్ట్
'అమ్మాయిగా మారి పదేళ్లు'.. బిగ్‌బాస్ ప్రియాంక ఎమోషనల్ పోస్ట్
అరటి పండు, బొప్పాయి కలిపి తింటున్నారా? అయితే జరిగేది ఇదే!
అరటి పండు, బొప్పాయి కలిపి తింటున్నారా? అయితే జరిగేది ఇదే!
నీరు తక్కువగా తాగితే మీ గుండెకు ప్రమాదమా? 
నీరు తక్కువగా తాగితే మీ గుండెకు ప్రమాదమా? 
స్వాతంత్య్ర వేడుకల్లో ఏనుగు మాంసం.. 23 ఏనుగుల వధపై విమర్శలు
స్వాతంత్య్ర వేడుకల్లో ఏనుగు మాంసం.. 23 ఏనుగుల వధపై విమర్శలు
ఎవరైనా మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారా..? ఈ ట్రిక్స్‌తో..
ఎవరైనా మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారా..? ఈ ట్రిక్స్‌తో..
ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలో సూరి- సుహాస్‌ల 150 కోట్ల బ్లాక్ బస్టర్
ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలో సూరి- సుహాస్‌ల 150 కోట్ల బ్లాక్ బస్టర్