AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓరీ దేవుడో..ఇంత పెద్ద పేరు ఎప్పుడైనా విన్నారా? చదివేందుకే 20 నిమిషాలు పడుతుంది!

మన దేశంలో లేదా ప్రపంచంలో ఎక్కడైనా సరే సాధారణంగా ఒక వ్యక్తి పేరులో రెండు, మూడు లేదా నాలుగు పదాలు ఉంటాయి. కానీ ఒక వ్యక్తి పేరులో ఏకంగా రెండు వేలకు పైగా పదాలు ఉంటే ఎలా ఉంటుంది? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. న్యూజిలాండ్ సంతతికి చెందిన, ప్రస్తుతం ఆస్ట్రేలియాలో నివసిస్తున్న లారెన్స్ వాట్కిన్స్ (Laurence Watkins) ప్రపంచంలోనే అత్యంత పొడవైన పేరు కలిగిన వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. అతడి కథేంటో తెలియాలంటే పూర్తి స్టోరీలోకి వెళ్లాల్సిందే..

ఓరీ దేవుడో..ఇంత పెద్ద పేరు ఎప్పుడైనా విన్నారా? చదివేందుకే 20 నిమిషాలు పడుతుంది!
World's Longest Name
Jyothi Gadda
|

Updated on: Jun 15, 2026 | 8:58 PM

Share

న్యూజిలాండ్‌కు చెందిన లారెన్స్ వాట్కిన్స్ అనే వ్యక్తి ప్రపంచంలోనే అత్యంత పొడవైన పేరు గల వ్యక్తిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నాడు. ఆయన పేరులో ఏకంగా 2,253 పదాలు ఉన్నాయి. గిన్నిస్ రికార్డులపై ఉన్న ఆసక్తితో 1990లో తన పేరును మార్చుకోవడానికి ఆయన న్యాయపోరాటం కూడా చేయాల్సి వచ్చింది. ఇంత పెద్ద పేరు ఉండటం వల్ల ఆయన రోజువారీ జీవితంలో అనేక ఆసక్తికరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆయన పెళ్లి సమయంలో పూర్తి పేరు చదవడానికి ఏకంగా 20 నిమిషాల సమయం పట్టింది. ఈ విచిత్రమైన రికార్డు,లారెన్స్ జీవిత విశేషాలను పూర్తిగా తెలుసుకుందాం.

1990కి ముందు లారెన్స్ ఒక సాధారణ లైబ్రరీ ఉద్యోగిగా ఉండేవారు. గిన్నిస్ రికార్డు సాధించాలనే బలమైన కోరికతో ఆయన తన పేరును మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం వివిధ పుస్తకాల నుండి, క్రైస్తవ సాధువుల చరిత్రల నుండి వేలాది పేర్లను సేకరించి తన పేరుకు జత చేసుకున్నారు. అయితే, ఇంత పెద్ద పేరును అధికారికంగా నమోదు చేయడం సులువు కాలేదు. మొదట రిజిస్ట్రార్ జనరల్ దీనిని తిరస్కరించగా, లారెన్స్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా న్యూజిలాండ్ హైకోర్టును ఆశ్రయించి, తన పేరును మార్చుకునే హక్కును సాధించుకున్నారు. ఆ తర్వాతే 1992లో గిన్నిస్ సంస్థ ఆయన పేరులో 2,253 పదాలు ఉన్నట్లు అధికారికంగా రికార్డుల్లో నమోదు చేసింది.

ఇంత పెద్ద పేరు ఉండటం వల్ల రికార్డు దక్కినప్పటికీ, లారెన్స్ కొన్ని ఇబ్బందులను కూడా ఎదుర్కొంటున్నారు. ఆయనకు కూడా తన పేరులోని అన్ని పదాలు గుర్తుండవు, అందుకే ఒక కాగితంపై రాసుకుని చూసుకుంటుంటారు. ప్రభుత్వ గుర్తింపు కార్డులు, బ్యాంక్ ఫారమ్‌లలో అంత పెద్ద పేరు పట్టదు కాబట్టి, రోజువారీ అవసరాల కోసం ఆయన కేవలం లారెన్స్ వాట్కిన్స్ అని మాత్రమే వాడుతుంటారు.

ఇవి కూడా చదవండి

అన్నిటికంటే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆయన వివాహ వేడుక జరిగినప్పుడు, అక్కడి మ్యారేజ్ సెలెబ్రెంట్ లారెన్స్ పూర్తి పేరును చదవడానికి ఏకంగా 20 నిమిషాల సమయం పట్టిందట. ఈ సంఘటన అప్పట్లో పెళ్లికి వచ్చిన అతిథులను ఎంతగానో ఆశ్చర్యపరిచింది.

గత మూడు దశాబ్దాలుగా లారెన్స్ వాట్కిన్స్ పేరిట ఉన్న ఈ విచిత్రమైన రికార్డును ఇప్పటివరకు ప్రపంచంలో ఎవరూ బద్దలు కొట్టలేకపోయారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి న్యూజిలాండ్ ప్రభుత్వం చట్టాలను కూడా సవరించింది. కాబట్టి,ఈ రికార్డు భవిష్యత్తులో కూడా లారెన్స్ పేరిట అలాగే నిలిచిపోయే అవకాశం ఉంది.

Follow Us
మీ ఇంట్లో తులసి మొక్క ఉందా..? అయితే, తప్పులు అస్సలు చేయొద్దు..
మీ ఇంట్లో తులసి మొక్క ఉందా..? అయితే, తప్పులు అస్సలు చేయొద్దు..
శుక్రవారం తెలంగాణ వ్యాప్తంగా స్కూళ్ళు, కాలేజీల బంద్.. ఎందుకంటే?
శుక్రవారం తెలంగాణ వ్యాప్తంగా స్కూళ్ళు, కాలేజీల బంద్.. ఎందుకంటే?
ఆ హీరోయిన్ షూటింగ్ నుంచి పారిపోయింది..
ఆ హీరోయిన్ షూటింగ్ నుంచి పారిపోయింది..
రేషన్ కార్డు నెంబర్ మర్చిపోయారా..? సింపుల్‌గా ఇలా తెలుసుకోండి..
రేషన్ కార్డు నెంబర్ మర్చిపోయారా..? సింపుల్‌గా ఇలా తెలుసుకోండి..
'టాక్సిక్' లో రెచ్చిపోయి నటించిన కియారా.. రెమ్యునరేషన్ ఎంతంటే?
'టాక్సిక్' లో రెచ్చిపోయి నటించిన కియారా.. రెమ్యునరేషన్ ఎంతంటే?
పర్సెంటేజ్ పంచాయతీ మళ్లీ మొదటికొచ్చిందా..?
పర్సెంటేజ్ పంచాయతీ మళ్లీ మొదటికొచ్చిందా..?
జట్టులో మార్పులు చేయాల్సి వస్తే మొదట సంజూనే టార్గెట్ చేస్తారా?
జట్టులో మార్పులు చేయాల్సి వస్తే మొదట సంజూనే టార్గెట్ చేస్తారా?
రోజూ ఉదయాన్నే తింటే.. 150 ఏళ్లు బలంగా ఉంటారు! తాతల నాటి సీక్రెట్‌
రోజూ ఉదయాన్నే తింటే.. 150 ఏళ్లు బలంగా ఉంటారు! తాతల నాటి సీక్రెట్‌
ఉదయాన్నే పొలానికి వెళ్లిన రైతు.. తచ్చాడుతూ కనిపించిన శ్వేతనాగు
ఉదయాన్నే పొలానికి వెళ్లిన రైతు.. తచ్చాడుతూ కనిపించిన శ్వేతనాగు
ఈ ఫొటోలో ఉన్న ఇద్దరూ.. తెలుగులో క్రేజీ దర్శకులు..
ఈ ఫొటోలో ఉన్న ఇద్దరూ.. తెలుగులో క్రేజీ దర్శకులు..