Viral Video: ఈ దంపతుల పెళ్ళికి సాక్షిగా వరుణుడు.. ఇప్పటినుంచే భార్యకు సేవ చేస్తున్న భర్త.. ఫన్నీ వీడియో వైరల్..
వైరల్ అవుతున్న వీడియోలో.. గొడుగు పట్టుకొని తాను తన భార్య తడవకుండా రక్షణ ఇస్తున్న భర్తను చూడవచ్చు. అదే సమయంలో కొంతమంది ఇంటిలోపల నుంచి త్వరగా త్వరగా ప్రదక్షణ చేయండి అన్నట్లు అనడం వినిపిస్తోంది. అంతేకాదు ఇంకొందరు 'మెమరబుల్ మ్యారేజ్' అంటూ నవ్వుకోవడం కూడా వినిపిస్తోంది.
సోషల్ మీడియాలో పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియోలు ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉన్నాయి. వివాహ వేడుకకు సంబంధించిన వీడియోలను చాలా మంది చూస్తూనే ఉన్నారు. కొని వీడియోలు ఫన్నీగా ఉంది నవ్విస్తే.. మరికొన్ని అయ్యో అనిపిస్తాయి. తాజాగా పెళ్ళికి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో పెళ్లి ముహూర్తం సమయంలో భారీ వర్షం కురుస్తోంది. అటువంటి పరిస్థితిలో వధూవరులు ఓ పెళ్లి పందిరిలో ఉన్న ఒక పందిరి రాటకు ప్రదక్షిణ చేస్తున్నారు. వర్షం నుంచి రక్షణగా వరుడు గొడుగు పట్టుకున్నాడు.. తాను తనతో పాటు తన భార్య వానకు తడవకుండా గొడుగు వేయగా.. ఇద్దరు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియోను చూసి నెటిజన్లు ఫుల్ ఖుషీ అవుతున్నారు. తమ్ముడి డెడికేషన్ చూడండి అని కొందరంటే.. వైరల్ అవుతున్న ఈ వీడియో మధ్యప్రదేశ్ కు చెందింది అని కొందరు చెబుతున్నారు.
వైరల్ అవుతున్న వీడియోలో.. గొడుగు పట్టుకొని తాను తన భార్య తడవకుండా రక్షణ ఇస్తున్న భర్తను చూడవచ్చు. అదే సమయంలో కొంతమంది ఇంటిలోపల నుంచి త్వరగా త్వరగా ప్రదక్షణ చేయండి అన్నట్లు అనడం వినిపిస్తోంది. అంతేకాదు ఇంకొందరు ‘మెమరబుల్ మ్యారేజ్’ అంటూ నవ్వుకోవడం కూడా వినిపిస్తోంది. పెళ్లి జరుగుతున్న సమయంలో భారీ వర్షం కురుస్తుండగా.. ఆ వర్షంలోనే వివాహ క్రతువు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇంటిలోపల కూర్చున్న పురోహితుడు మంత్రాలు పఠిస్తుండగా.. అదే సమయంలో వధూవరులు కుండపోత వర్షంలో ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
పెళ్లికి సాక్షిగా వరుణుడు
View this post on Instagram
ఇప్పుడు ఈ అపూర్వ వివాహానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో @giedde అనే ఖాతాతో షేర్ చేశారు. ఈ వీడియో ఇప్పటి వరకు 4200కు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది. అదే సమయంలో నెటిజన్లు రకరకాల ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
ఒకరు.. సోదరుడు (వరుడు) అంకితభావాన్ని చూడండి. మరోవైపు వివాహానికి సాక్ష్యంగా అందరూ అగ్నిని తీసుకుంటే.. ఇక్కడ ఈ వధూవరులు తమ పెళ్ళికి సాక్ష్యంగా వరుణ దేవుడిని తీసుకున్నారు అంటూ కామెంట్ చేశారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..