AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మానవత్వం ఇంకా ఉంది అందడానికి ఉదాహరణ ఈ వీడియో.. రోడ్డు క్రాస్ చేయడానికి ఇబ్బంది పడుతున్న బాలిక.. సాయం చేసిన యువతి..

ప్రతి ఒక్కరూ ఇలా ఉండాలని రూల్ లేదు.. ఇప్పటికీ చాలా మంది మానవత్వంతో నడుచుకుంటూ ఆపన్నులకు సహాయం చేస్తున్నారు. అందుకు ఉదాహరణగా నిలుస్తుంది తాజాగా వైరల్ అవుతున్న వీడియో.

Viral Video: మానవత్వం ఇంకా ఉంది అందడానికి ఉదాహరణ ఈ వీడియో.. రోడ్డు క్రాస్ చేయడానికి ఇబ్బంది పడుతున్న బాలిక.. సాయం చేసిన యువతి..
Viral Video
Surya Kala
|

Updated on: May 02, 2023 | 10:25 AM

Share

ఇంటర్నెట్ ప్రపంచంలో రోజు కొన్ని వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. కొన్ని మాత్రం నెటిజన్లను ఆకర్షిస్తాయి… చర్చనీయాంశంగా మారతాయి. కొన్ని ఫన్నీ వీడియోలు అయితే ఎన్ని సార్లు చూస్తారో లెక్కేలేదు. వాటిని చూసి నిరంతరం నవ్వుతూనే ఉంటారు.  అయితే కొన్ని రకాల వీడియోలు మాత్రం పుస్తకంలో కూడా చెప్పని నేర్పని జీవిత పాఠాలను నేర్పిస్తూ ఉంటాయి. హృదయాలను కదిలిస్తూ ఉంటాయి. ఇలాంటి వీడియోలు అనేకం ఉంటాయి. మనం చాలాసార్లు చూస్తూనే ఉంటాం. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా మానవత్వం  ఇంకా  సజీవంగా ఉందని వ్యాఖ్యానిస్తారు.

ప్రస్తుతం కాలంతో పాటు మనిషి కూడా వేగంగా పరిగెడుతూ ఉన్నాడు. అదే సమయంలో మానవత్వం అంటే ఏమిటో పూర్తిగా మరచిపోతున్నాడు. ఎందుకంటే ఉరుకుల పరుగుల జీవితంలో అందరికంటే  ముందుండాలనే రేసులో అన్నీ మర్చిపోతున్నారు. సాయం అడిగేవారుకొందరు.. ఎవరైనా సహాయం చేస్తారా అంటూ ఎదురుచూసే వారు తరచుగా కనిపిస్తూనే ఉంటారు. అయినప్పటికీ అటువంటి వారిని పట్టించుకుండా తమ జీవన పరుగులో లీనం అవుతూ ఉంటారు.

ఇవి కూడా చదవండి

కొందరు రోడ్డు పక్కన నిలుచుకుని అది దాటడానికి వీలు కాకా.. నిస్సహాయ స్థితిలో నిలబడతారు. అంతేకాదు తనకు ఎవరైనా తమకు సహాయం చేస్తారా అంటూ ఎదురుచూస్తూ ఉంటారు. అయితే ఇలాంటి బాధితులను చూస్తూ కూడా తమ పనిని తాము చేసుకుంటూ వెళ్లిపోయేవారు చాలామంది ఉన్నారు. తమ కళ్ల ఎదురుగా  ఎవరికీ ఎంత నష్టం జరిగినా పట్టించుకోరు. ఇలాంటి సంఘటనలు చూస్తే.. మానవత్వం కనుమరుగైందా అని కొందరు తమలో తాము వ్యాఖ్యానించుకుంటారు. అయితే ప్రతి ఒక్కరూ ఇలా ఉండాలని రూల్ లేదు..   ఇప్పటికీ చాలా మంది మానవత్వంతో నడుచుకుంటూ ఆపన్నులకు సహాయం చేస్తున్నారు. అందుకు ఉదాహరణగా నిలుస్తుంది తాజాగా వైరల్ అవుతున్న వీడియో. ఈ వైరల్ క్లిప్‌లో ఒక మహిళ రోడ్డు మధ్యలోకి వచ్చి అమ్మాయికి సహాయం చేసి ఆమెను ఒక వైపు నుండి మరొక వైపుకు తీసుకువెళుతుంది.

వైరల్ అవుతున్న వీడియోలో, ఒక అమ్మాయి కాలు విరిగిన క్రషర్స్ సహాయంతో రోడ్డు దాటడానికి ప్రయత్నించడం చూడవచ్చు. అయితే ఆ యువతి రోడ్డుపైకి రాగానే రెడ్ లైట్..  పచ్చగా మారి వాహనాలు ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. దీంతో ఆ యువతి భయపడుతుంది. పక్కనే నిలబడిన ఓ మహిళ ఇదంతా చూస్తూ హఠాత్తుగా పరుగున వచ్చి.. రోడ్డు దాటడానికి రెడీ అవుతున్న వాహనాలను ఆపమంటూ సిగ్నల్ ఇస్తూ.. ఆ అమ్మాయిని తన వీపుపై కూర్చోబెట్టుకుని రోడ్డుని దాటించింది.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..