Gol gappas in leaf: విస్తరాకుల్లో పానీపూరి విక్రయం…సూపర్బ్‌ కాన్సెప్ట్‌ అంటోన్న నెటిజన్లు

పానీపూరి లేదా గోల్‌ గప్పాలు...రోడ్లపై విక్రయించే ఈ స్ట్రీట్‌ఫుడ్‌ను ఇష్టపడని వారు ఎంతో అరుదుగా ఉంటారు......

Gol gappas in leaf:  విస్తరాకుల్లో పానీపూరి విక్రయం...సూపర్బ్‌ కాన్సెప్ట్‌ అంటోన్న నెటిజన్లు
Follow us
Basha Shek

|

Updated on: Oct 26, 2021 | 9:41 AM

పానీపూరి లేదా గోల్‌ గప్పాలు…రోడ్లపై విక్రయించే ఈ స్ట్రీట్‌ఫుడ్‌ను ఇష్టపడని వారు ఎంతో అరుదుగా ఉంటారు. ఎంత ధనవంతులైనా అప్పుడప్పుడు ఈ టేస్టీ ఛాట్‌ కోసం చెయ్యి చాపాల్సిందే. అందుకు తగ్గట్టే పానీపూరి వ్యాపారులు క్షణం తీరిక లేకుండా గడుపుతుంటారు. నోరూరించే ఈ స్ట్రీట్‌ ఫుడ్‌ని సాధారణంగా స్టీ్‌ల్‌ లేదా ప్లాస్టిక్‌ ప్లేట్లలో పెట్టి కస్టమర్లకు అందిస్తుంటారు. అయితే దిల్లీకి చెందిన ఓ వ్యాపారి మాత్రం వెరైటీగా ఆకుల్లో పెట్టి సర్వ్‌ చేస్తున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది. ఆరోగ్యానికీ మంచిదే! ఇప్పుడంటే బాగా తగ్గిపోయింది కానీ గతంలో సంప్రదాయ అరటి ఆకుల్లో భోజనాలను వడ్డించేవారు. ఇప్పుడు కూడా కొన్ని పల్లెలు, గ్రామాల్లోని కొన్ని హోటళ్లలో విస్తరాకుల్లోనే ఆహార పదార్థాలను సర్వ్‌ చేస్తుంటారు. ఇలా ఆకుల్లో తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతుంటారు. ఈ నేపథ్యంలో దిల్లీలోని ఛాందినీ చౌక్‌లో ఓ పానీపూరి వ్యాపారి కూడా ఆకులతో తయారుచేసిన ప్లేట్లలో గోల్‌ గప్పాలు అందిస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను అర్జున్‌ చౌహాన్‌ అనే ఓ ఫుడ్‌ బ్లాగర్‌ ట్విట్టర్‌లో షేర్‌ చేసుకున్నాడు. ఈ వీడియోలో భాగంగా పానీపూరి వ్యాపారి ముందుగా శనగలు, ఆలూ మసాలాతో పూరీలను ఫిల్లింగ్‌ చేస్తాడు. అనంతరం పెరుగులో ముంచుతాడు. ఆతర్వాత వాటిని చట్నీ, కారప్పూస, మసాలాతో గార్నిష్‌ చేసి ఆకుల్లో పెట్టి కస్టమర్లకు అందిస్తాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పానీపూరి వ్యాపారి కాన్సెప్ట్‌ అద్భుతంగా ఉందని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Also Read:

Viral Video: డ్రైవర్‌లెస్‌ బైక్‌ రైడింగ్‌.. ట్రోల్‌ చేస్తున్న నెటిజన్స్‌.. వీడియో

Viral Video: ఇదేం రసగుల్లా చాట్‌ రా బాబు.. నెట్టింట వైరల్.. వీడియో

Viral Video: ఈతకు వెళ్లిన వ్యక్తికి.. చిక్కిన 900ఏళ్ల నాటి ఖడ్గం.! వీడియో

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే