Viral Video : రెండు పిల్లులు కొట్టుకుంటుంటే మధ్యలో దూరిన కాకి.. చివరకు..
ఈ వైరల్ వీడియోలో రెండు పిల్లులు కొట్టుకోవడం మనం చూడొచ్చు. నడివీధిలో కూడా భీకర పోరే జరిగింది. మాములుగా పిల్లులకు ఒక్కటంటే ఒకదానికి పడదు.
సోషల్ మీడియాలో నిత్యం వేలల్లో రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో రెండు పిల్లులు కొట్టుకోవడం మనం చూడొచ్చు. నడివీధిలో కూడా భీకర పోరే జరిగింది. మాములుగా పిల్లులకు ఒక్కటంటే ఒకదానికి పడదు. ఎప్పుడు కయ్యానికి కాలుదువ్వుతూ ఉంటాయి. అయితే ఇక్కడ రెండు పిల్లులు కొట్టుకుంటుంటే మధ్యలో ఒక కాకి దూరి ట్విస్ట్ ఇచ్చింది. మాములుగా పిల్లులు పక్షులను చూస్తే వాటిని వేటాడుతాయి. అయితే ఇక్కడ పిల్లి మాత్రం స్నేహం చేసిందనుకుంటా..
వైరల్ అవుతోన్న ఈ వీడియోలో రెండు పిల్లులు కొట్టుకుంటున్నాయి. వీధిలో రెండు పిల్లల మధ్య పెద్ద గొడవే అవుతోంది. అయితే ఇంతలో ఒక కానీ అక్కడైకి వచ్చింది. ఆ కాకి ఆ రెండు పిల్లులు కొట్టుకుంటుంటే.. ఒక దానిని మాత్రమే వెనకనుంచి పొడుస్తూ కనిపించింది. ఈవీడియో పై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మనందరికీ స్నేహితులు ఉన్నారు. కానీ కొంతమంది మాత్రమే సన్నిహితంగా ఉంటారు..ఈ కాకి లాగా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది రెండు పిల్లులకు మధ్యలో ఆ కాకి రిఫరీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోకు 3 వేల వ్యూస్ వచ్చాయి.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..