Skeletal Alien Hand: సముద్ర తీరాన బయటపడిన భారీ పరిమాణంలోని చేతి అస్థిపంచరం.. అది ఏలియన్‌కు చెందినదేనా..?
బీచ్‌లో సరదాగా తిరగాడుతున్న ప్రేమ జంటకు పెద్దగా ఉన్న ఓ చేతి అస్థిపంజరం కనిపించింది. వెంటనే భయపడిపోయిన ఆ జంట దానిని ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అది ఏలియన్‌కు..

బీచ్‌లో సరదాగా తిరగాడుతున్న ప్రేమ జంటకు పెద్దగా ఉన్న ఓ చేతి అస్థిపంజరం కనిపించింది. వెంటనే భయపడిపోయిన ఆ జంట దానిని ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అది ఏలియన్‌కు చెందినదేమోనని వారు అనుమానపడుతున్నారు. ఆ ప్రేమ జంట పెట్టిన సోషల్ మీడియా పోస్ట్‌కు నెటిజన్లు ఎంతో ఆసక్తిగా స్పందిస్తున్నారు. అది డైనోజర్‌దని ఒకరు, చేపదని మరొకరు.. ఇలా అందరూ తమ తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. నవంబర్ 20న లెటిసియా గోమ్స్ శాంటియాగో, ఆమె ప్రియుడు దేవానీర్ సౌజాతో కలిసి బ్రెజిల్, సావో పాలో స్టేట్‌లోని ఇల్హా కాంప్రిడా బీచ్‌లో సరదాగా తిరుగుతున్నారు.
అంతలోనే కనిపించిన ఈ భారీ ఆకారంలోని చేతిని చూపి ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. దాని గురించి లెటిసియా ‘‘ చేతి పరిమాణం చాలా పెద్దదిగా ఉంది. ఆ ఆకారణాన్ని బట్టి అది మనిషిది అయితే కాదని మేము అనుకుంటున్నాము. అది ఏమై ఉండవచ్చు..? అది ఏ జంతువుకు చెందినదో మాకు తెలియదు. కానీ అది ఏదైనా ఏలియన్‌కు చెందిన చెయ్యి అయితే నిజంగా ఘోరం’’ అని అన్నారు. దీనిని చూసిన ఓ వ్యక్తి ‘‘అది చేప చెయ్యి అయ్యుండవచ్చు’’ అని అభిప్రాయపడ్డాడు.
అయితే మరో వ్యక్తి ‘‘ అది డైనోసార్ ఎముక కూడా కావచ్చు కదా..!’’ అని కామెంట్ చేశారు. మరోకరు అయితే ‘‘ దీన్ని ఎవరైనా జీవశాస్త్రవేత్త వద్దకు తీసుకెళ్లండి.. ఎందుకంటే ఇది సాధారణమైనది కాదు’’ కాదు అని సలహానిచ్చాడు. అయితే ప్రముఖ సముద్ర జీవశాస్త్రవేత్త ఎరిక్ కోమిన్ ఈ పెద్ద చెయ్యి సెటాసియన్‌కు చెందినదని. ఇది తిమింగలాలు, డాల్ఫిన్‌లను తినే ఓ జల క్షీరదం అని పేర్కొన్నారు. అయితే అది ఏమిటనేదాని గురించి ఖచ్చితంగా చెప్పాలంటే.. మరిన్ని పరీక్షలు అవసరమని ఆయన తెలిపారు.



