Shocking: వరుస మారింది.. పెళ్లైన పదేళ్లకు అన్నాచెల్లెల్లు అని తెలిసింది.. ఆ తరువాత రియాక్షన్స్ ఏంటో మీరే చూడండి..
Viral News: వారిద్దిరూ ప్రేమించుకున్నారు.. సహజీవనం కూడా చేశారు.. ఇద్దరూ పదేళ్ల క్రితమే పెళ్లి చేసుకున్నారు.. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.. కానీ 10 సంవత్సరాలు అసలు విషయం తెలిసి
వారిద్దిరూ ప్రేమించుకున్నారు.. సహజీవనం కూడా చేశారు.. ఇద్దరూ పదేళ్ల క్రితమే పెళ్లి చేసుకున్నారు.. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.. కానీ 10 సంవత్సరాలు అసలు విషయం తెలిసి ఇద్దరి ముఖాలు మాడిపోయాయి. ఆ విషయం ఏంటో తెలిస్తే మీ ముఖాలు కూడా చిత్రవిచిత్రంగా మారిపోతాయి. అవును మరి.. పెళ్లి చేసుకున్న పదేళ్లకు తామిద్దరూ తోబుట్టువులని తెలిస్తే ఎలా ఉంటుంది? ఇలాంటి పరిస్థితే ఓ జంటకు ఎదురైంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే విషయం తెలుసుకున్న నెటిజన్లు.. పెళ్లి సమయంలో ఒకరి బ్యాక్‌గ్రౌండ్ ఒకరు చెక్ చేసుకోలేదా? అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఒక జంట తమ నిజమైన సంబంధం గురించి చేసిన షాకింగ్ అన్వేషణ తర్వాత సోషల్ మీడియాను ఉన్మాదంలోకి పంపారు 13 సంవత్సరాలు కలిసి ఉన్న తరువాత, వారు 10 సంవత్సరాలకు వివాహం చేసుకున్నారు, వారు తోబుట్టువులని తెలుసుకున్నారు పెళ్లి చేసుకునే ముందు తమను తాము ఎందుకు బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేసుకోలేదని ప్రజలు ఆశ్చర్యపోతున్నప్పుడు ఈ జంట వార్తల్లోకి వచ్చిన వీడియోకు మిశ్రమ స్పందనలు వచ్చాయి.
అమెరికాకు చెందిన ఓ జంట.. పెద్దల సమక్షంలోనే వివాహం చేసుకున్నారు. 2008లో వీరికి వివాహం జరుగగా.. 2011లో వీరు మొదటి బిడ్డకు జన్మనిచ్చారు. ఆ తరువాత 2015లో రెండవ బిడ్డకు జన్మనిచ్చారు. ఇద్దరూ 13 సంవత్సరాలు కలిసి ఉన్నారు. అయితే, వీరిద్దరు దంపతుల మధ్య రక్త సంబంధం ఉన్నట్లు ఇటీవలే గుర్తించారు. ఈ వివరాలను వెల్లడిస్తూ ఈ జంట @stzyathletemo పేరుతో ఉన్న TikTok అకౌంట్‌లో వీడియో షేర్ చేశారు. ఇప్పుడిది సంచలనంగా మారింది. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
నెటిజన్ల నుంచి అదిరిపోయే కామెంట్స్..
ఇది కామన్ అని కొందరు అంటుంటే.. మరికొందరు ముందే చూసుకోవద్దా అంటూ సెటైర్లు వేస్తున్నారు. మరికొందరైతే.. తమ పేరెంట్స్ ఇల్లీగల్ సంబంధాలపై కుల్లు జోకులు వేస్తూ.. ఎవరు ఎవరికి తోబుట్టువులు అవుతారో తెలియడం లేదంటున్నారు. ఓ నెటిజన్ అయితే, ‘మా అమ్మ బయట ఏ అమ్మాయితోనూ మాట్లాడొద్దు అంటుంది. ఎందుకంటే.. నాకు జన్మనిచ్చిన తండ్రికి బయట చాలా మంది పిల్లలు ఉన్నారట. వారిలో ఎవరు నాకు తోబుట్టువులు అవుతారో తెలియదు’ అంటూ కామెంట్ పెట్టాడు. ఇంకొ నెటిజన్ అయితే కాస్త భిన్నంగా స్పందించాడు. ‘తన పెళ్లికి ముందు మా పేరెంట్స్, అమ్మాయి వాళ్ల పేరెంట్స్ బ్లడ్ టెస్ట్ చేయించారు’ అని చెప్పాడు. ఇక చేసేదేమీ లేదు.. కలిసి ఉండటమే తరువాయి పని అని మరికొందరు సలహా ఇస్తున్నారు.
నోట్: టిక్‌టాక్ యాప్ మన దేశంలో బ్యాన్ చేయడం వలన.. వీడియోను ఇక్కడ ఇవ్వలేకపోతున్నాము.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..