AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: మధ్యాహ్నం సమయంలో బెడ్రూంలో నుంచి వింత శబ్ధాలు.. ఏంటా అని వెళ్లి చూడగా షాక్..

ఆ దంపతులు రోజు లాగానే వారి.. వారి పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఇంట్లో నుంచి వింత శబ్ధాలు వినిపించాయి. అలాంటి సౌండ్స్ వారు గతంలో ఎప్పుడూ వినలేదు. ఈ క్రమంలో..

Viral: మధ్యాహ్నం సమయంలో బెడ్రూంలో నుంచి వింత శబ్ధాలు.. ఏంటా అని వెళ్లి చూడగా షాక్..
Representative image
Ram Naramaneni
|

Updated on: Jul 21, 2022 | 1:40 PM

Share

Trending:  వృద్ధ దంపతులు బిజీ ప్రపంచానికి దూరంగా చాలా ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఒకరు ఒకరు తోడుగా ఉంటూ.. ఆనందాల్ని పంచుకుంటూ ప్రయాణం సాగిస్తున్నారు. అయితే వీరి ఇంటికి ఒకరోజు అనుకోని అతిథి(The unexpected guest) వచ్చింది. అదేంటో తెలుసుకుందాం పదండి. లిండా గోల్డీ (73),  ఆమె భర్త పీటర్( 70)  నార్త్ వెస్ట్ ఇంగ్లాండ్, కుంబ్రియాలోని స్కిన్‌బర్నెస్‌లో గల తమ హాలిడే హోమ్‌లో గడుపుతున్నారు. రోజులానే వారి.. వారి పనుల్లో బిజీగా ఉండగా.. ఇంట్లో నుంచి వింత శబ్ధాలు వచ్చాయి. దీంతో అనుమానం వచ్చి ఇళ్లంతా వెతకడం ప్రారంభించారు. ఆ సౌండ్ బెడ్‌రూమ్‌ నుంచి వస్తున్నట్లు వారు కనుగొన్నారు. స్లోగా ఆ రూమ్‌లోకి ఎంటరయ్యాయి. దిండ్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.  కొవ్వొత్తి సెట్ నేలపై పడి ముక్కలు.. ముక్కలు అయ్యింది. దీంతో వారు కంగారు పడ్డారు. దొంగ ఏమో అని అలెర్ట్ అయ్యారు. ఇంకొంచెం లోపలికి వెళ్లి చూడగా అప్పుడు కనిపించింది ఆ అనుకోని అతిథి. అది ఒక నీటి కుక్క(Otter). అది బెడ్‌పై పడుకుని ఎంచక్కా గురక పెడుతూ నిద్రపోతుంది. దీంతో ఒక్కసారిగా కంగుతిన్నారు. ఓ వ్యక్తి సహాయంతో దాన్ని బెడ్ రూమ్ నుంచి బయటకు తీసుకురాగలిగారు. ఆ తర్వాత అది భయపడుతూ అక్కడి నుంచి జారుకుంది. పెట్ గేట్ ద్వారా అది ఇంట్లోకి వచ్చి ఉండొచ్చని పీటర్ తెలిపారు. (Source)

Otter

Otter

నీటి కుక్కలు ఉభయచర జీవులు. అంటే నీళ్ల లోపల, నీళ్ల బయట కూడా జీవిస్తాయి.  ఇవి మనుషులకు ఎలాంటి చెయ్యవు. నీటిలో చేపల కన్నా ఎక్కువ వేగంగా ఈదుతాయి.  నీటి కుక్కల జాతి చాలా వరకు కనుమరుగైందని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తలు చదవండి..