Srinagar Woman: దమ్ముంటే నా ముందుకు రాండిరా.. టెర్రస్టులకు కశ్మీర్ యువతి సవాల్.. వైరల్ అవుతున్న వీడియో..
Srinagar Woman: ఝాన్సీ రాణీ లక్ష్మీబాయి, రాణీ రుద్రమ దేవి వంటి వీర నారీమణులను కన్న గడ్డ భారత భూమి. దేశంలో ధీర వనితలకు కొదవే లేదు.

Srinagar Woman: ఝాన్సీ రాణీ లక్ష్మీబాయి, రాణీ రుద్రమ దేవి వంటి వీర నారీమణులను కన్న గడ్డ భారత భూమి. దేశంలో ధీర వనితలకు కొదవే లేదు. వారి ధైర్య సాహసాలు అనన్యసామాన్యం. ఎదుటి వారు ఎంతటి వారైనా త్రుచ్చ సమానులుగా చూసి.. చెడుగుడు ఆడేసుకున్న వారు ఎందరో ఉన్నారు. తాజాగా అలాంటి లక్షణాలే కలిగిన జమ్మూకశ్మీర్‌కు చెందిన యువతి వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో యువతి టెర్రరిస్టులకు సవాల్ విసిరింది. ‘‘దమ్ముంటే, ధైర్యముంటే నా ముందుకు రాండిరా.. ముఖాముఖి చర్చించుకుందాం.. మీరేందో, మీ కథేందో తేలుస్తాం..’’ అంటూ ఉగ్రమూకలకు సవాల్ విసిరింది.
మంగళవారం నాడు శ్రీనగర్‌కు చెందిన వ్యాపారవేత్త ఎంఎల్ బింద్రూను ఉగ్రవాదులు అత్యంత క్రూరంగా చంపేశారు. అయితే, తన తండ్రిని చంపిన టెర్రరిస్టులపై ఆయన కూతురు శ్రద్ధా బింద్రూ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఈ క్రమంలోనే ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘నా తండ్రి చనిపోయి ఉండొచ్చు. కానీ, అతని ఆత్మ జీవించే ఉంటుంది. మీకు ధైర్యం ఉంటే నా ముందుకు రండి. ముఖా ముఖి చర్చిద్దాం. అప్పుడు మీరేంతో తేలుస్తాం.’’ అని టెర్రరిస్టులకు శ్రద్ధా బింద్రూ సవాల్ విసిరారు. కాగా, ఈ వీడియోను జమ్మూ కశ్మీర్‌కు చెందిన పోలీస్ ఆఫీసర్ ఇంతియాజ్ హుస్సేన్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘భారతదేశం ఈమె లాంటి ఆడబిడ్డలకు జన్మనిచ్చినంత కాలం పిరికిపందలైన ఉగ్రవాదులు ఎన్నటికీ విజయం సాధించలేరు.’ అని క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
As long as India gives birth to daughters like her, coward terrorists will never succeed in their nefarious designs. pic.twitter.com/FV8iMv0DKj
— Imtiyaz Hussain (@hussain_imtiyaz) October 6, 2021
Also read:
Tirumala Brahmotsavam: ఇవాళ్టి నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు.. రంగ రంగ వైభవంగా ముస్తాబైన తిరుమలగిరులు
లడాఖ్‌లో అతిపెద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఇండియన్.. వీడియో