Video Viral: ప్రకృతి గీసిన చిత్తరువు.. సునామీ అనుకుంటే పొరబడినట్లే.. అసలు విషయం తెలిస్తే వావ్ అనాల్సిందే
ప్రకృతిని (Nature) మించిన గొప్ప ఆర్టిస్ట్ భూమిపై లేడు. అంతే కాకుండా ప్రకృతి కంటే ప్రమాదకరమైనది ఇంకేదీ లేదు. మర్చిపోని అనుభవాన్ని, అనుభూతిని ఇచ్చే ప్రకృతి.. అంతే మొత్తంలో ప్రమాదం కలిగించి నాశనం చేసేస్తుంది....
ప్రకృతిని (Nature) మించిన గొప్ప ఆర్టిస్ట్ భూమిపై లేడు. అంతే కాకుండా ప్రకృతి కంటే ప్రమాదకరమైనది ఇంకేదీ లేదు. మర్చిపోని అనుభవాన్ని, అనుభూతిని ఇచ్చే ప్రకృతి.. అంతే మొత్తంలో ప్రమాదం కలిగించి నాశనం చేసేస్తుంది. సునామీలు , వరదలు, తుఫానులు వంటివి చాలా భయంకరమైనవే కాకుండా ప్రమాదకరమైనవి కూడా. ఇవి ప్రతిదీ నాశనం చేయగల శక్తిని కలిగి ఉంటాయి. ఇలాంటి ప్రకృతి ప్రమాదాలతో పాటు అందమైన ప్రకృతి చిత్రాలు సోషల్ మీడియాలో కోకొల్లలు. వీటని చూసిన తర్వాత ప్రజలు ఆశ్చర్యపోతారు. సోషల్ మీడియాలో (Social Media) కూడా ప్రకృతి అందాలకు సంబంధించిన అన్ని వీడియోలను మీరు చూసే ఉంటారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న క్లిప్ లో ప్రకృతి రూపాన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోయారు. మేఘమా లేక భయంకరమైన సునామీనా అని ఆలోచనలో పడ్డారు. వీడియోలో కొన్ని ఇళ్లు కనపిస్తాయి. వాటి ముందు విశాలమైన రోడ్డు కూడా ఉంటుంది. ఇంటి వెనకాలే భయంకరమైన సునామీ వచ్చినట్లు కనిపిస్తుంది. కానీ నిజానికి అది సునామీ కాదు సునామీలా కనిపిస్తున్న మేఘమని తెలిసి ఆశ్చర్యపోవడం పక్కా. ప్రకృతికి సంబంధించిన ఈ అద్భుతమైన దృశ్యం చాలా అందంగా, ఆశ్చర్యకరంగా ఉంది.
I was under the impression it was a tsunami I’ve never seen clouds like this before. pic.twitter.com/HfCpw0bwf8
ఇవి కూడా చదవండి— Interesting As Fuck (@InterestingPot) September 7, 2022
ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. ‘నేను ఇంతకు ముందు ఇలాంటి మేఘాలను ఎప్పుడూ చూడలేదు’ అనే క్యాప్షన్ తో షేర్ అయింది. కేవలం 27 సెకన్ల ఈ వీడియోకు ఇప్పటివరకు 3 లక్షల 44 వేలకు పైగా వ్యూస్, 14 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. వీడియో చూసిన తర్వాత నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ దృశ్యం స్వర్గంలా కనిపిస్తోందని కొందరంటుంటే, మరికొందరు మాత్రం అచ్చం సినిమాల్లో చూసినట్లు ఉందని కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..