AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: దర్టీ ఇండియన్ ఫుడ్ అంటూ ఎగతాళి చేసిన చైనీస్ యువతి.. తగిన సమాధానం ఇచ్చిన భారతీయ యూట్యూబర్

ప్రసిద్ధ భారతీయ ట్రావెల్ వ్లాగర్ ప్యాసింజర్ పరమవీర్ కి సంబంధించిన ఓ వీడియో వైరల్ అయ్యింది. దీనిలో అతను భారతీయ, చైనీస్ ఫుడ్ గురించి చైనీస్ మహిళతో తేలికపాటి చర్చలు జరుపుతున్నాడు. ఇదిలా ఉంటే ఓ చైనీస్ మహిళ కొన్ని వీడియోలను చూపిస్తూ ఇండియన్ ఫుడ్‌ను ఎగతాళి చేసింది. దీనిపై పరమవీర్ స్పందించిన తీరు ప్రజల మనసులను గెలుచుకుంది.

Viral Video: దర్టీ ఇండియన్ ఫుడ్ అంటూ ఎగతాళి చేసిన చైనీస్ యువతి.. తగిన సమాధానం ఇచ్చిన భారతీయ యూట్యూబర్
Viral VideoImage Credit source: FedAmshaa
Surya Kala
|

Updated on: Oct 28, 2024 | 1:07 PM

Share

ఒక చైనీస్ యువతి భారతీయ ఆహారాన్ని ఎగతాళి చేసినప్పుడు భారతీయ యూట్యూబర్ చాలా ప్రశాంతంగా స్పందించాడు. అంతేకాదు ఆ చైనా యువతికి భారతీయ ఆహారం గురించి వర్ణించిన విధానం ప్రజల హృదయాలను గెలుచుకుంది. వైరల్ అవుతున్న వీడియోలో భారతదేశానికి చెందిన ప్రసిద్ధ ట్రావెల్ వ్లాగర్ ‘ప్యాసింజర్ పరమవీర్’ ఒక చైనీస్ యువతితో మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ సమయంలో చైనీస్ మహిళ తన ఫోన్‌లో కొన్ని టిక్‌టాక్ వీడియోలను చూపించింది. అంతేకాదు భారతీయ ఆహారం దర్టీ అని కామెంట్ చేసింది. ఆ యువతి చూపించిన వీడియో క్లిప్‌లలో ఒక విక్రేత తన చంకను తుడుచు కుంటూనే మళ్ళీ ఆ చేతితో పిండిని పట్టునట్లు, మరొకదానిలో వంటవాడు వంట చేస్తున్నప్పుడు పాన్‌లో చేతులు కడుక్కోవడం వంటివి ఉన్నాయి.

అయితే ఆ వీడియో క్లిప్ లు చూసిన తర్వాత, vlogger పరమవీర్ నవ్వడం మొదలుపెట్టాడు. అంతేకాదు ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ ఆహార సంస్కృతిలో ఇది కేవలం మినహాయింపు అని ఆ యువతికి చెప్పాడు. అసలు ఇలాంటి వీడియోలు మీకు ఎక్కడి నుంచి వస్తాయో నాకు తెలియదు. అయితే క్లీన్ ప్లేస్ కి వెళితే ఇండియన్ ఫుడ్ ఫ్లేవర్ల మోజులో పడి చైనీస్ ఫుడ్ మర్చిపోతారు నమ్మండి అని ఆ యువతికి చెప్పాడు.

ఇవి కూడా చదవండి

దీని తరువాత పరమవీర్ చైనీస్ యువతిని ఓ మంచి భారతీయ రెస్టారెంట్‌కి తీసుకెళ్ళాడు. అక్కడ ఆమె దాల్ మఖానీ, షాహీ పనీర్, నాన్‌లను ఆస్వాదించింది. ఈ వీడియోలోభారతీయ ఫుడ్ ని తిన్న తర్వాత తన సందేహాలు తొలగిపోయాయని.. నిజంగా ఇండియన్ ఫుడ్ రుచికరమైనదని ఆమె చెప్పింది.

ఇక్కడ వీడియో చూడండి, భారతీయ ఆహారాన్ని చైనీస్ మహిళ ఎగతాళి చేసింది

@FedAmsha హ్యాండిల్‌తో 2 నిమిషాల 21 సెకన్ల ఈ వీడియో క్లిప్‌ను షేర్ చేస్తూ వినియోగదారు క్యాప్షన్‌లో ఇలా వ్రాశారు.. చైనీస్ యువతి డర్టీ ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ వీడియోను భారతీయ యూట్యూబర్‌కి చూపుతుంది. తద్వారా అతను ఇబ్బంది పడ్డాడు. అందుకు బదులుగా వ్లాగర్ ఆమెను చక్కటి భారతీయ రెస్టారెంట్‌కి తీసుకెళ్లి.. చైనాలో ఆమెకు అద్భుతమైన భారతీయ వంటకాలను రుచి చూపించాడు.

కొంతమంది కొన్ని వీడియోల ఆధారంగా భారతీయ వంటకాలను అంచనా వేయడం దురదృష్టకరమని ఒక వినియోగదారు వ్యాఖ్యానించారు. పరమవీర్ భాయ్ తనకు అద్దం చూపించినందుకు ఆనందంగా ఉంది. మరొక వినియోగదారు మాట్లాడుతూ ఈ వీడియోను చూస్తుంటే భారతదేశానికి ఖచ్చితంగా మెరుగైన PR అవసరమని అనిపిస్తోంది. ఎలుకలు, బొద్దింకలను తినే వారికి భారతీయ రుచుల రుచి తెలియదని మరొకరు కామెంట్ చేశారు

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..